Site icon HashtagU Telugu

Bholaa Shankar Hyper Aadi Speech : అన్న మంచోడు కాబట్టి ముంచేశారు..తమ్ముడు మొండోడు..

Aadi Speech Bholashankar

Aadi Speech Bholashankar

అన్నయ్య మంచోడు కాబట్టే ముంచేశారు.. కానీ తమ్ముడు మొండోడు.. తాడో పేడో తేల్చుకుంటాడు. హైపర్ అది మరోసారి మెగా అభిమానాన్ని చాటుకున్నాడు. ఒకప్పుడు మెగా అభిమానులంతా బండ్ల గణేష్ స్పీచ్ కోసం ఎదురు చూసేవారు..కానీ ఇప్పుడు అంత హైపర్ ఆది స్పీచ్ కోసం ఎదురుచూస్తున్నారు. మెగా హీరోల సినిమాల ఈవెంట్లకు హైపర్ ఆది వచ్చాడంటే మెగా అభిమానులకు ఫుల్ మిల్స్ దొరికినట్లే. అభిమానులకు ఎలాంటి డైలాగ్స్ కావాలో..ఎవరి గురించి ఎలా మాట్లాడితే అభిమానులు ఈలలు వేస్తారో..పవన్ కళ్యాణ్ ఫై ఎలాంటి ప్రశంసలు కురిపించాలో..శత్రువులకు ఎలాంటి కౌంటర్లు ఇవ్వాలో హైపర్ ఆదికి తెలిసినంత మరొకరికి తెలియదు. అందుకే హైపర్ ఆది వచ్చాడంటే అంత ఆయన స్పీచ్ కోసమే ఎదురుచూస్తుంటారు.

హైపర్ ఆది స్కిట్స్ కు ఎంత వ్యూస్ వచ్చాయో..అంతకు రెట్టింపు ఈ మధ్య ఆయన స్పీచ్ లకు వస్తున్నాయి. తాజాగా ఆదివారం జరిగిన భోళాశంకర్ ప్రీ రిలీజ్ (Bholaa Shankar Pre Release) ఈవెంట్ లో హైపర్ ఆది తన స్పీచ్ తో అదరగొట్టడమే..పవన్ గురించి చెపుతూ..అన్నయ్య (Chiranjeevi) కళ్లలో నీళ్లు వచ్చేలా చేసాడు. ప్రస్తుతం ఈ స్పీచ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దుమ్ములేపుతుంది.

ఏ మెగా అభిమాన్ని చూసిన ఆది (Hyper Aadi ) స్పీచే వింటున్నారు. ఒక్కో డైలాగ్ ఆది చెపుతుంటే..ప్రతి మెగా అభిమానికి రోమాలు నిక్క పొడిచేస్తున్నాయి. చిరంజీవి , నాగబాబు , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ ఇలా అందరిపై ప్రశంసలు కురిపించారు.

* సచిన్ టెండుల్కర్ కొడుకు సచిన్ అవ్వలేదు.. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ అవ్వలేదు.. కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యారు.

* ఇక్కడ ఉన్న హీరోలను తట్టుకుని.. వాళ్లందరినీ నెట్టుకుని.. చిరంజీవి గారి పేరు నిలబెట్టుకుని.. ఎంత ఎదిగినా చేతులు కట్టుకుని రామ్ చరణ్ ఒదిగి ఉంటారు.

* చిరంజీవి తనను అవమానించిన వాళ్లను ఆయన వదిలేస్తాడేమో కానీ.. తమ్ముడు మాత్రం వారిని గుర్తు పెట్టుకుని వడ్డీతో సహా రిటర్న్ ఇచ్చేస్తారు.

* చిరంజీవి గారు అభిమానులను ప్రేమిస్తారు.. శత్రువులను క్షమిస్తారు. నాగేంద్ర బాబు.. అన్నదమ్ముల కోసం అడ్డంగా నిలబడతారు.

* పవన్ కల్యాణ్ గారు.. అందరి లెక్క తేలుస్తాడు.. అనుకున్నది సాధిస్తాడు. అన్నయ్య మంచోడు కాబట్టి.. ముంచేశారు.. తమ్ముడు మొండోడు.. తాడో పేడో తేల్చేస్తాడు

* కొంత మంది తమ్ముడిని పొగిడి అన్నయ్యను తిడుతున్నారు.. తన తమ్ముడిని తిట్టి తనను పొగిడే ఆనంద పడేవాడా? ఆయన.. ఈ మధ్య ఒక సారి రాజకీయాల గురించి ఆయన్ను అడిగాను.. రాజకీయ వార్తలు చూడటం మానేశాను అని అన్నారు.. నా తమ్ముడిని ఎవడు పడితే వాడు తిడుతున్నాడు.. అందుకే వార్తలు చూడటం లేదు.. అని అన్నారు.. ఆయన్ను అవమానించిన వాడ్ని ఆయన వదిలేస్తాడేమో గానీ.. తమ్ముడు మాత్రం వదలడు.. అందరికీ తిరిగి ఇస్తాడు.

* ‘ఓ మధ్య తరగతి వాడు యుద్దం చేసేందుకు వచ్చాడు.. అప్పటి వరకు ఎంతో మంది యుద్దం చేస్తూనే ఉన్నారు.. ఒకసారి ఆయనకు చాన్స్ వచ్చింది.. యుద్దం చేశాడు.. ఆ యుద్దభూమికి సైన్యాధిపతి అయ్యాడు.. ముప్పై ఏళ్లుగా ఆ యుద్దభూమిని ఏలుతూనే ఉన్నాను.. ఆయనే చిరంజీవి.. చిత్రపరిశ్రమను ఏలుతూనే ఉన్నాడు.. అన్నయ్య ఇంత మంది సినీ సైనికులను తయారు చేసి ఇంద్ర సేనాని అయితే.. అక్కడ తమ్ముడేమో జన సైనికుల్ని తయారు చేసి జన సేనాని అయ్యాడు.. అని ఆది చెపుతుంటే ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

* ఆయనకు ఠాగూర్ సినిమాలో నచ్చని పదం క్షమించడం.. కానీ నిజ జీవితంలో అందరినీ క్షమిస్తూనే ఉంటాడు

* ఓ స్టార్ డైరెక్టర్ (వర్మ) ఉన్నాడు.. ఆయన్ను అనే అర్హత నాకు లేదు.. కానీ ఆయనకు కూడా మెగాస్టార్, పవర్ స్టార్ గారిని అనే అర్హత లేదు.. ఓ పెగ్ వేస్తే మెగాస్టార్ గురించి.. ఇంకో పెగ్ వేస్తే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు..ఇలా ఆది నుండి వచ్చిన ప్రతి డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంది. ఇక మీరు కూడా ఈ స్పీచ్ ఫై లుక్ వెయ్యండి.

Read Also : Pawan Condolence To Gaddar : గద్దర్ కొడుకుని హత్తుకొని ఏడ్చేసిన పవన్ కళ్యాణ్