Site icon HashtagU Telugu

Hyper Aadi : ఏ హీరోని వదిలిపెట్టని హైపర్ ఆది.. ఎన్టీఆర్ నుంచి కిరణ్ వరకు సెన్సేషనల్ కామెంట్స్..!

Don't Troll National Award Winner Allu Arjun Says Hypder Aadi

Don't Troll National Award Winner Allu Arjun Says Hypder Aadi

మైక్ ఇస్తే చాలు మోత మోగించే స్పీచ్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు హైపర్ ఆది. జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ తో సినిమా ఛాన్స్ లు అందుకుంటున్న ఆది (Hyper Aadi) ఈమధ్య తరచు సినిమా ఈవెంట్ లో స్పీచ్ లతో అదరగొట్టేస్తున్నాడు. ఆది స్పీచ్ ఇస్తే అందులో ప్రాసలు పంచులు ఎలివేషన్లు ఇవన్ని ఉంటాయి. ఎప్పుడు ఒక హీరోని మాత్రమే పొగిడే ఆది టాలీవుడ్ అందరు హీరోల అభిమానిగా మారిపోయి వాళ్లందరి గురించి చెప్పాడు.

దాదాపు 10 నిమిషాల పాటు ఎన్.టి.ఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు నుంచి ఈ తరం యువ హీరోలు విశ్వక్ సేన్, నిఖిల్, కిరణ్ అబ్బవరం వరకు మాట్లాడేశాడు. సినిమాలు సమాజాన్ని పాడు చేస్తున్నాయన్న విషయాన్ని ప్రస్తావించిన ఆది సినిమా లో మంచిని చూడాలి కానీ చెడుని కాదు. తెలుగు సినిమా నేషనల్ అవార్డులు, జాతీయ స్థాయి రివార్డులు అందుకుంటుంది.

అలాంటి పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఇక సినిమాకు పనిచేసే వాళ్లే కాదు ట్రోల్స్, మీమ్స్, రివ్యూస్ ఇలా చేస్తున్న వారు కూడా సినిమా పరిశ్రమలో భాగమని. ట్రోల్స్ కూడా ఒకరిని బాధ పెట్టేలా ఉండకూడదని అన్నారు. ఇక చివరగా రూల్స్ రంజన్ గురించి చెబుతూ ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుందని తప్పకుండా అందరినీ అలరిస్తుందని అన్నారు హైపర్ ఆది.

జబర్దస్త్ నుంచి సినిమాల్లోకి వచ్చిన హైపర్ ఆది స్టేజ్ ఎక్కితే చాలు తన స్పీచ్ తో సినీ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. టాలీవుడ్ హీరోల మీద తన మనసులోని అభిప్రాయాలను చెప్పిన ఆది ఈ దెబ్బతో అందరి హీరోల ఫ్యాన్స్ మనసులు గెలిచాడు.

Also Read : Prabhas : సలార్ వల్ల రిలీజ్ గందరగోళం..!