జబర్దస్త్ ఫేమ్ హైపర్ అది (Hyper Aadi) కిడ్నాప్ కు గురయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. జబర్దస్త్ (Jabardasth) షో ద్వారా పరిచమైన హైపర్ అది..స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అది వేసే పంచ్ లు ఆయన్ను మరింత పాపులర్ చేసాయి. గత కొన్నేళ్లుగా హైపర్ అది జబర్దస్త్ షో తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాగే వెండితెర ఫై వరుస సినిమాలతో మరింత ఆకట్టుకుంటున్నారు. హైపర్ ఆది పంచ్ లు ఎంత నవ్విస్తాయో అంతే వివాదం రాజేస్తాయి.
పలుమార్లు హైపర్ ఆది ఫ్లోలో పంచ్ (Hyper Aadi Punches) లు వేసి క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వాలు, కొన్ని సామాజిక వర్గాలు, మహిళలను ఉద్దేశిస్తూ ఆయన రాసిన జోక్స్ వివాదాస్పదం అయ్యాయి. ఆడవాళ్ల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్న హైపర్ ఆదికి బుద్ది చెప్పాలని మహిళలు డిసైడ్ అయ్యి, అతన్ని కిడ్నాప్ చేశారు. తాళ్లతో బంధించి 10 గంటలు ఆదికి అన్నం, నీళ్లు లేకుండా మాడ్చారు. అయితే ఇది నిజమైన కిడ్నాప్ కాదు. శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company)లో ఒక స్కిట్ మాత్రమే.
ఆదివారం ప్రసారమై ఈ షో కు సంబదించిన ప్రోమో ను మల్లెమల్ల విడుదల చేసింది. ఈ ప్రోమో లో సీరియల్ నటీమణులు హైపర్ ఆదిని కిడ్నాప్ చేశారు. ఆడవాళ్ళకు గౌరవం ఇవ్వనందుకు నీకు శిక్ష అన్నారు. అయితే మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే మీరు ఈ శిక్ష వేసినా స్వీకరిస్తానని హైపర్ ఆది చెప్పాడు. ఈ స్కిట్ లో కూడా హైపర్ ఆది తన మార్క్ పంచ్లతో అలరించారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది.
Read Also: Surinder Shinda: పంజాబీ గాయకుడు సురీందర్ షిండా మృతి