Site icon HashtagU Telugu

Hyper Aadi : హైపర్ ఆది ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు.. తన ఎంట్రీకి పవన్ కళ్యాణ్ సినిమా హెల్ప్ అయ్యిందా..?

Hyper Aadi Jabardasth Entry and how Hyper Aadi get first Chance

Hyper Aadi Jabardasth Entry and how Hyper Aadi get first Chance

టాలీవుడ్(Tollywood) లో హైపర్ ఆది(Hyper Aadi) అంటే తెలియని వారు ఉండరు. ప్రముఖ తెలుగు కామెడీ షో జబర్దస్త్ (Jabardasth) ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆది.. తన కామెడీ టైమింగ్, అదిరిపోయే పంచ్ లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. జబర్దస్త్ కి మాత్రమే కాకుండా పలు టీవీ షోలకు కూడా స్క్రిప్ట్ లు రాస్తూ ఇండస్ట్రీ వర్గాల్లో తన కామెడీ రైటింగ్స్ కి ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో పలు సినిమాలకు కూడా కామెడీ పోర్షన్ రాసేందుకు అవకాశాలు అందుకున్నాడు. కాగా ఆది జబర్దస్త్ కి రాకముందు అసలు ఏం చేసేవాడు? జబర్దస్త్ వరకు ఎలా వచ్చాడో తెలుసా..?

ఆది అసలు పేరు ‘కోట ఆదయ్య’. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లోనే ఒక సాఫ్ట్‌వెర్ కంపెనీలో పని చేసేవాడు. అయితే ఆదికి ఒకే చోట కూర్చొని ఒక యంత్రంలా పని చేయడం అంటే ఇష్టం ఉండేదు కాదు. ఇక ముందు నుంచి ఆదిలో సెన్స్ అఫ్ హ్యూమర్ ఎక్కువ ఉండేది. ఎప్పుడు కామెడీ చేస్తూ, పంచ్ లు వేస్తూ తన పక్క వారిని నవ్విస్తూ ఉండేవాడు. అలాంటి ఆదికి జబర్దస్త్ షో నచ్చింది. తాను కూడా అక్కడ కామెడీ చేసి అందర్నీ నవ్వించాలని అనుకున్నాడు. కానీ అక్కడ వరకు ఎలా వెళ్లాలో తెలియదు.

దీంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘అత్తారింటికి దారేది’ క్లైమాక్స్ సన్నివేశాన్ని స్పూఫ్ గా చేసి ఆ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. అదే వీడియోని పేస్‌బుక్ లో కూడా అప్లోడ్ చేయగా పలువురు ఇండస్ట్రీ రైటర్లు అప్పటికే జరుగుతున్న ఓ కామెడీ షోకి పిలవడంతో అక్కడ మొదలుపెట్టి అనంతరం జబర్దస్త్ లో ఉన్న అదిరే అభి పరిచయం అవ్వడంతో అభి టీం మెంబెర్ గా, రైటర్ గా కూడా జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చి, తానే ఒకే టీం లీడర్ హైపర్ ఆదిగా ఎదిగాడు. నలుగురిని నవ్వించాలి అనే లక్ష్యం తప్ప జబర్దస్త్ కి రావాలని, ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు లక్ష్యంగా పెట్టుకోలేదని ఒక ఇంటర్వ్యూలో ఆది చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బిజీగా ఉన్న కమెడియన్స్ లో ఆది కూడా ఒకరు.

 

Also Read : Syed Sohel : థియేటర్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.. కానీ కొందరు యూట్యూబ్‌లో సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు..