Kumari Aunty: కుమారీ ఆంటీ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వనుందా.. అసలు నిజం ఇదే?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో కుమారి ఆంటీ పేరు కూడా ఒకటి. సోషల్ మీడియా పుణ్యమా అని కుమారి ఆంటీ సెలబ్రిటీ హోదాను ద

Published By: HashtagU Telugu Desk
Hyderabad Food Stall Vendor Kumari Aunty Craze In Telugu States V Jpg 816x480 4g

Hyderabad Food Stall Vendor Kumari Aunty Craze In Telugu States V Jpg 816x480 4g

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో కుమారి ఆంటీ పేరు కూడా ఒకటి. సోషల్ మీడియా పుణ్యమా అని కుమారి ఆంటీ సెలబ్రిటీ హోదాను దక్కించుకున్న విషయం తెలిసిందే. రెండు లివర్లు ఎక్స్ట్రా టోటల్ 1000 అనే ఒకే ఒక్క డైలాగ్ తో బాగా ఫేమస్ అయింది. కానీ అదే ఆమె కొంప ముంచిందని చెప్పవచ్చు. ఆ ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఆమెపై దారుణంగా ట్రోల్లింగ్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఫుడ్ లవర్స్.. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారీ ఆంటీ వీడియోలను వైరల్ చేశారు. దాంతో ఆమె దగ్గర భోజనం చేయడానికి జనాలు ఎగబడ్డారు. దాంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ జామ్ అవుతున్న కారణంగా ఆమెను షాప్ తీసేయాలని చెప్పారు. దాంతో ఆమె జీవనాదారం పోతుందని పోలీసులను బ్రతిమిలాడుకుంది. ఆ తర్వాత పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగింది. చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించి. ఆమె షాప్ ను తొలగించవద్దు అని త్వరలోనే ఆమె ఫుడ్ స్టాల్ కు వస్తానని అన్నారు. దాంతో ఆమె ఓవర్ నైట్ సెలబ్రెటీ అయ్యింది. దీంతో చాలామంది వచ్చే బిగ్ బాస్ సీజన్ 8 లో కుమారి ఆంటీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు వారు, తెలుగు ఛానల్స్ కుమారి ఆంటీని తమ ప్రమోషన్స్ కోసం బాగా ఉపయోగించుకుంటున్నారు.

ట్రాఫిక్ పోలీసులు చలానా వెయ్యాలన్నా కుమారి ఆంటీ డైలాగ్ కావాలి, ఒక బిజినెస్ ప్రమోషన్ జరగాలన్నా కుమారి ఆంటీ అపిరెన్స్ కావాలి, ఒక టీవీ షో టిఆర్పి పెరగాలన్నా కుమారి ఆంటీ ఎంట్రీ కావాలి. దీంతో ప్రతిరోజు ఏదో విధంగా కుమారి ఆంటీ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ షోల్లో, సీరియల్స్ లో కనిపిస్తున్న కుమారి ఆంటీ త్వరలో.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ కి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే బిగ్‌బాస్ ఉత్సవ్ లో గెస్ట్ గా పాల్గొని సందడి చేసిన కుమారి ఆంటీని త్వరలో కంటెస్టెంట్ గా కూడా తీసుకు వచ్చేస్తారని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా స్టార్స్ ని కంటెస్టెంట్స్ గా తీసుకు వచ్చిన బిగ్‌బాస్ నిర్వాహుకులు నెక్స్ట్ సీజన్ కి కుమారి ఆంటీని కూడా తీసుకు వస్తారేమో చూడాలి మరి.

  Last Updated: 13 Mar 2024, 04:38 PM IST