హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భద్రతా కారణాలతో బీఎన్ఎస్ సెక్షన్ 163 కింద అక్టోబర్ 27 నుంచి నవంబర్ 28 వరకు ఆంక్షలు (144 Section) విధిస్తూ హైదరాబాద్ పోలీసులు (Hyd Police) ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షల ప్రకారం, 5 మందికి మించి గుమిగూడడం, ర్యాలీలు నిర్వహించడం నిషేధించబడింది. ఈ నెల రోజుల సమయంలో హైదరాబాద్ లో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించడానికి అనుమతి లేదని.. ఎవరైనా ర్యాలీలు, సభలు, సమావేశాలు పర్మిషన్ లేకుండా నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఈ ఆంక్షలు చిత్రసీమ (Tollywood) కు విపరీతమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నారు. రాబోయే తెలుగు సినిమా విడుదలకు సంబంధించిన పబ్లిక్ ఈవెంట్లను ప్రభావితం చేయనుంది. దసరా, దీపావళి సినిమాల ప్రమోషన్లు దాదాపుగా పూర్తయ్యాయి.
సూర్య నటించిన కంగువా (నవంబర్ 14): సూర్య తన పబ్లిక్ ప్రమోషన్లను ఇప్పటికే పూర్తి చేసినందున ఈ చిత్రంపై ఆంక్షల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.
నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (నవంబర్ 8): ఈ సినిమా కోసం ప్రమోషన్లు ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఈ ఆంక్షల కారణంగా, పబ్లిక్ ఈవెంట్స్‌కు అనుమతులు లభించకపోవడం వల్ల ఇండోర్ ప్రమోషన్లపైనే నిఖిల్ టీమ్ ఆధారపడాల్సి వస్తుంది.
వరుణ్ తేజ్ మట్కా: ఈ సినిమా నవంబర్ చివర్లో విడుదల కానుండటంతో, దీపావళి తర్వాత భారీ ప్రమోషన్ల కోసం ప్లాన్ చేసిన వరుణ్ తేజ్ టీమ్ ఇప్పుడు ఇండోర్, ఆన్‌లైన్ ప్రమోషన్లకు మళ్లాల్సి ఉంటుంది.
విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ (నవంబర్ 22): ఈ చిత్రం ప్రమోషన్ కూడా 144 సెక్షన్ కారణంగా ఇండోర్ ఈవెంట్లకు పరిమితం కానుంది.
అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ (డిసెంబర్ 5): 2024 లో విడుదల కానున్న అతిపెద్ద సినిమా కావడంతో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. నవంబర్ 27 తరువాత ఆంక్షలు తొలగితే హైదరాబాద్ లో పెద్ద ఈవెంట్ నిర్వహించవచ్చు. లేకుంటే ఆంధ్రప్రదేశ్ లో భారీ ఈవెంట్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా కోసం ఇండోర్ ప్రమోషన్లు మాత్రం యథావిధిగా సాగుతాయి. మొత్తానికి, ఈ ఆంక్షల కారణంగా తెలుగు చిత్రాలు పబ్లిక్ ప్రమోషన్ ఈవెంట్లకు పరిమితం కాక, ఇండోర్ లేదా డిజిటల్ ప్రమోషన్లపై దృష్టి సారించాల్సి వస్తుంది. ఈ ఆంక్షల పట్ల నగరవాసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా టైములో ఇదే మాదిరి నిర్బంధం చేసారు..ఆ తర్వాత అంత సెట్ అయ్యింది. హైదరాబాద్ లో స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడి..ఏ టైములో పడితే ఆ టైం లో తిరగొచ్చు అని అంత అభిప్రాయం తో సిటీకి వస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ ఆంక్షల వల్ల వచ్చేవారు రాకపోగా..ఉన్న వారు కూడా బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి కాంగ్రెస్ సర్కార్ వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం.
Read Also : BJP : మహారాష్ట్ర ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల