గేమ్ ఛేంజర్ మేకర్స్ కు , డిస్ట్రబ్యూటర్స్ కు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మార్నింగ్ స్పెషల్ షో కు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. ఇప్పటికే సినిమా కు మిక్సిడ్ టాక్ వచ్చి షాక్ ఇస్తే..ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఇచ్చిన ఆదేశాలతో అభిమానులు, చిత్రయూనిట్ మరింత షాక్ కు గురి అవుతున్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన గేమ్ ఛేంజర్ (Game Changer ) మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram Charan)..గేమ్ చేంజర్ తో మరోసారి తన సత్తా చాటుతాడని అంత ఊహించారు. కానీ తీవ్రంగా నిరాశ పరిచాడు. శంకర్ డైరెక్షన్ , దిల్ రాజు నిర్మాణం అనగానే సినిమా పై హై రేంజ్ అంచనాలు పెట్టుకొని వెళ్లిన అభిమానులకు , ప్రేక్షకులకు బోర్ కొట్టించాడు. కథలో కొత్తదనం లేకపోవడం , సాంగ్స్ పెద్దగా బాగుండకపోవడం , సాగదీత సన్నివేశాలు ఇలా ప్రతిదీ బోర్ కొట్టించాయి. ఇదే క్రమంలో మొదటి రోజే సినిమా HD ప్రింట్ మాదిరి ఆన్లైన్లో దర్శనం ఇచ్చింది. ఇప్పటికే చాలామంది ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకొని సినిమా చూస్తున్నారు. సోషల్ మీడియా లో కూడా పెద్ద ఎత్తున సినిమా బాగాలేదని , డబ్బులు బొక్క అంటూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా షాక్ ఇచ్చింది.
Singapore Passport : సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే పవర్ ఫుల్ ఎలా అయింది ?
గేమ్ ఛేంజర్ సినిమాకు రెండు వారాల పాటు ప్రత్యేక షోకు అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్ అయ్యింది. ప్రత్యేక షోల వల్ల ప్రయోజనం ఏంటంటూ ప్రశ్నించింది. అంతే కాకుండా బెనిఫిట్ షోలను రద్దు చేసి స్పెషల్ షో అంటూ కొత్తగా అనుమతి ఇవ్వడం ఏంటి అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. టికెట్ రేట్ల విషయమై పుష్ప 2 కేసుతో పాటు విచారణ జరుపుతామని హైకోర్ట్ పేర్కొంది. ప్రత్యేక షోల విషయంలో హైకోర్ట్ సీరియస్ కావడంతో గేమ్ ఛేంజర్‌కి రెండు వారాలకి ఇచ్చిన ప్రత్యేక షో అనుమతులను రద్దు చేస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పండుగ సీజన్ వరకు రోజుకు అయిదు షోలు వేయడం వల్ల భారీ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉదయం ఆటలు క్యాన్సల్ అవుతాయి. రెగ్యులర్ టైమింగ్స్‌లోనే షో లు పడనున్నాయి. రోజుకు నాలుగు షోలతోనే గేమ్ ఛేంజర్ ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా వసూళ్ల పై ప్రభావం పడనుంది. ఏది ఏమైనప్పటికి నిర్మాత దిల్ రాజు కూడా గేమ్ ఛేంజర్ విషయంలో వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి.