Ram Charan : సంక్రాంతి బరిలో తప్పుకున్న స్టార్ హీరో.. చరణ్ కి బాగా కలిసొస్తుంది..

తమిళ్ లో ఈసారి పెద్ద సినిమాలు ఏమి లేవు. అజిత్ విడాముయార్చి సినిమా ఒకటే ఉంది.

Published By: HashtagU Telugu Desk
Huge Plus to Ram Charan Game Changer Movie in Tamilanadu Due to Ajith Vidaamuyarchi Postpone

Ajith Charan

Ram Charan : సంక్రాంతి బరిలో ఈసారి మూడు పెద్ద సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 10న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, జనవరి 12న బాలకృష్ణ డాకు మహారాజ్, జనవరి 14న వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఉన్నాయి. తెలుగులో ఈ మూడు పెద్ద సినిమాలు ఉండగా తమిళ్ డబ్బింగ్ సినిమా అజిత్(Ajith) విడాముయార్చి(Vidaamuyarchi) కూడా ఉంది.

తమిళ్ లో ఈసారి పెద్ద సినిమాలు ఏమి లేవు. అజిత్ విడాముయార్చి సినిమా ఒకటే ఉంది. అజిత్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎదురుచూసారు. ఈసారి వేరే పెద్ద సినిమాలు కూడా ఏమి లేకపోవడంతో సంక్రాంతికి తమిళనాడులో విడాముయార్చికి బాగా కలిసొస్తుంది అనుకున్నారు. కానీ తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా సంక్రాంతికి రావట్లేదని, వాయిదా పడిందని అధికారికంగా ప్రకటించారు.

దీంతో అజిత్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అలాగే థియేటర్స్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా పండక్కి పెద్ద సినిమా లేకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు చిన్న సినిమాలు తప్ప తమిళ్ లో సంక్రాంతికి ఒక్క పెద్ద సినిమా కూడా లేకుండా పోయింది.

అయితే అజిత్ సినిమా వాయిదా పడటంతో గేమ్ ఛేంజర్ కి తమిళనాడులో బాగా కలిసిరానుంది. గేమ్ ఛేంజర్ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించడం, థియేటర్స్ కావాల్సినన్ని దొరికే ఛాన్స్ రావడం, తమిళ్ స్టార్ SJ సూర్య ఈ సినిమాలో విలన్ గా నటించడం సినిమాకు తమిళ్ మార్కెట్ లో ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అజిత్ సినిమా వాయిదా పడటంతో తమిళ ప్రేక్షకులకు సంక్రాంతికి గేమ్ ఛేంజర్ ఒక్కటే మిగిలింది. దీంతో చరణ్ గేమ్ ఛేంజర్ కి తమిళనాడులో బాగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాస్త హిట్ టాక్ వినిపిస్తే చాలు అక్కడ కూడా ఫుల్ గా కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంది.

 

Also Read : Ram Pothinni : రామ్ ఏంటి ఇలా మారిపోయాడు.. రామ్ నెక్స్ట్ సినిమా పోస్టర్..

  Last Updated: 01 Jan 2025, 11:28 AM IST