Site icon HashtagU Telugu

Vishwambhara: విశ్వంభర లో భారీ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్.. ఆ సీన్స్ సినిమాకే హైలైట్

Vishwambhara Release Date

Vishwambhara Release Date

Vishwambhara: చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘విశ్వంభర’ చిత్రానికి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశ్ రూపొందించిన 54 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహంతో సహా భారీ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్ ను భారీ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ప్రఖ్యాత రామ్-లక్ష్మణ్ మాస్టర్ల ద్వయం పర్యవేక్షించిన ఈ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని, చిరంజీవికి, ఫైటర్స్ కు మధ్య జరిగే ఇంటెన్స్ ఫైట్ ను చూపించారు.

విశేషం ఏమిటంటే, ఈ సన్నివేశాన్ని 26 పనిదినాల్లో చిత్రీకరించారు. ఇది భారతీయ సినిమాలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. ఒకే ఫైట్ సన్నివేశానికి చిరు ఎక్కువ రోజుల పనిచేయాల్సి వచ్చింది. ఈ రోజు ఈ సీక్వెన్స్ కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కావడంతో ఈ అద్భుతమైన యాక్షన్ బ్లాక్ ను థియేటర్స్ లో చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.

యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ లెన్స్ మ్యాన్ చోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 2025 జనవరి 10న ‘విశ్వంభర’ గ్రాండ్గా విడుదల కానుంది.

Exit mobile version