Site icon HashtagU Telugu

Sreeleela Lip Lock : వామ్మో..మార్కెట్ లో శ్రీలీల ముద్దు రేటు రూ.5 కోట్లా..?

Sreeleela Liplock

Sreeleela Liplock

టాలీవుడ్ అంత శ్రీలీల (Sreeleela) మాయలో ఉంది. చిన్న హీరో దగ్గరి నుండి పెద్ద హీరోల వరకు అంత ఆమెనే కావాలని కోరుకుంటున్నారు. పెళ్లి సందD మూవీ తో తెలుగు నాట అడుగుపెట్టిన ఈ భామ..మొదటి సినిమాతోనే తన గ్లామర్ తో , డాన్స్ లతో కట్టిపడేసింది. ఆ తర్వాత ధమాకా సినిమా ఆమెను ఏకంగా స్టార్ హీరోయిన్ ను చేసేసింది. ధమాకా లో ఆమె డాన్స్ లు యూత్ కు కిక్ ఇచ్చాయి. ప్రస్తుతం ఒకటి , రెండు కాదు అమ్మడి చేతిలో దాదాపు డజన్ సినిమాలు ఉన్నాయి. అవి కూడా మామలు హీరోలతో కాదు పవర్ స్టార్ , సూపర్ స్టార్ వంటి అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోలతో జోడి కడుతుంది. ఇవన్నీ విడుదలైతే అమ్మడి ని అందుకోవడం ఎవరి వల్ల కాదు. అమ్మడి డిమాండ్ , పాపులర్ చూసి ప్రతి ఒక్కరు శ్రీలీల నే కావాలని కోరుకుంటున్నారు.

ఇదే క్రమంలో ఓ పాపులర్ హీరో శ్రీలీల ఫై ఉన్న ఇంట్రస్ట్ తో ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చాడట. శ్రీలీల డైరెక్ట్ గా లిప్ లాక్ (Sree Leela Lip Lock) ఇస్తే ఏకంగా ఐదు కోట్ల పారితోషకం ఇస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్లో అంత మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ ఆఫర్ కు అమ్మడు నో చెప్పిందట. అంతే కాకుండా ఎవరికి డైరెక్ట్ లిప్ లాక్ ఇవ్వనంటే ఇవ్వనని స్పష్టం చేసిందట. శ్రీలీలో ఆఫర్ రిజెక్ట్ చేయడం మాట అటు ఉంచితే .. ఆ పాపులర్ హీరో మాత్రం శ్రీలీల తో ముద్దు కోసం ఇంత పరితపిస్తున్నాడా ..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఒక్క నిమిషం ముద్దు కోసం ఐదు కోట్లా..? వామ్మో శ్రీలీల ఇలా ముద్దులతోనే కోట్లు సంపాదించవచ్చు కదా అని మరికొంతమంది అంటున్నారు.

Read Also : Rajinikanth : యూపీ సీఎం యోగి కాళ్లు మొక్కిన జైలర్