Site icon HashtagU Telugu

Nani Hit 3 : ఆ సినిమాకు కోట్లు పెట్టేస్తున్న నాని.. రిస్క్ అని తెలిసినా కూడా తగ్గట్లేదు..!

Huge Budget for Nani Hit 3 Shailesh Konalu

Huge Budget for Nani Hit 3 Shailesh Konalu

Nani Hit 3 టైర్ 2 హీరోల్లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న నాని లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్నతో అదరగొట్టగా ఈ ఇయర్ సరిపోదా శనివారం సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా నానిలోని మాస్ యానిల్ ని మరోసారి చూపించింది. ఈ సినిమా పూర్తి కాగానే నాని శైలేష్ కొలను (Sailesh Kolan) డైరెక్షన్ లో హిట్ 3 చేస్తున్నాడు.

నాని నిర్మాతగా సూపర్ సక్సెస్ ఫ్రాంచైజ్ గా హిట్ వస్తుంది. హిట్ 1 లో విశ్వక్ సేన్, హిట్ 2 లో అడివి శేష్ చేశారు. ఇప్పుడు హిట్ 3 లో నాని (Nani) నటిస్తున్నాడు. హిట్ 2లోనే నాని క్లైమాక్స్ లో సర్ ప్రైజ్ ఎంట్రీ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక హిట్ 3 (Hit 3)లో నాని పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నాడు. ఐతే హిట్ 3 కోసం అంతకుముందు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ పెట్టేస్తున్నారట.

హ్యాట్రిక్ హిట్లతో నాని..

హ్యాట్రిక్ హిట్లతో నాని రేంజ్ మరింత పెరిగింది. అందుకే సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసేలా హిట్ 3 ని తెరకెక్కిస్తున్నారట. దీనికోసం ముందు అనుకున్న బడ్జెట్ ని కూడా పెంచినట్టు తెలుస్తుంది. హిట్ 3 కోసం నాని తన కొత్త లుక్ ట్రై చేసినట్టు టాక్. కె.జి.ఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. హిట్ 3 పూర్తి కాగానే నాని సుజిత్ కాంబో సినిమా ఒకటి ప్లానింగ్ లో ఉంది.

నాని హిట్ 3 సినిమా నెక్స్ట్ సమ్మర్ టార్గెట్ తో వస్తుంది. నాని తన సినిమాల ప్లానింగ్ తో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు.