Site icon HashtagU Telugu

Naga Chaitanya : భారీ బడ్జెట్ తో నాగ చైతన్య మూవీ.. సూపర్ హిట్ డైరెక్టర్ తో మూవీ..!

Do you know Naga Chaitanya Favorite Food

Do you know Naga Chaitanya Favorite Food

అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం తండేల్ సినిమా తో బిజీగా ఉన్నాడు. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సాయి పల్లవి (Sai Pallavi) సినిమాలో భాగం అవ్వడం వల్ల సినిమా రేంజ్ మరింత పెరిగింది. ఈ సినిమాకు దేవి శ్రీ మ్యూజిక్ కూడా హెల్ప్ అయ్యేలా ఉంది. సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ బుజ్జి తల్లి ఇన్ స్టంట్ హిట్ గా నిలిచింది.

ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో తండేల్ (Thandel) సినిమా రాబోతుంది. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య సూపర్ హిట్ డైరెక్టర్ కార్తీక్ దండు (Kartik Dandu)తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ కార్తీక్ దండు తన నెక్స్ట్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నాగ చైతన్యతో చేస్తున్న ఈ సినిమాకు 120 కోట్ల పైన బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.

తండేల్ సినిమానే చైతన్య కెరీర్ లో హైయ్యెస్ట్ బడ్జెట్ కాగా దానికి మించి నెక్స్ట్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. నాగ చైతన్య కూడా చిన్నగా 100 కోట్ల మార్కెట్ పొందేందుకు ట్రై చేస్తున్నాడు. తండేల్ సినిమాతో 100 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడు అక్కినేని హీరో. సినిమా వైబ్ చూస్తుంటే తప్పకుండా అది సాధించేలా ఉంది. నాగ చైతన్య తండేల్ రిలీజ్ అయ్యాక వెంటనే కార్తీక్ సినిమా మొదలవుతుందని తెలుస్తుంది.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు టాక్.

Also Read : Dil Raju : సంక్రాంతికి దిల్ రాజు మూడు ముక్కలాట..!