Site icon HashtagU Telugu

Hrithik Roshan- Jr NTR: యుద్ధభూమిలో నీకోసం ఎదురుచూస్తున్నా మిత్రమా.. జూనియర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన హృతిక్‌..!

Hrithik Roshan- Jr NTR

Resizeimagesize (1280 X 720) (3)

శనివారం (మే 20) తన 40వ పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)కు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కు తన ట్వీట్ ద్వారా హృతిక్ (Hrithik Roshan) ఈ విషెస్ తెలిపారు. వార్ 2లో హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించంనున్నారు.

పాన్‌ ఇండియా స్టార్‌ ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ కూడా బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. ‘యద్ధభూమిలో నీకోసం ఎదురుచూస్తున్నా మిత్రమా. పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని హృతిక్‌ చేసిన ట్వీట్‌ ఆకట్టుకుంటోంది. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, విక్టరీ వెంకటేష్‌ కూడా జూనియర్ కు విషెస్ తెలిపారు.

Also Read: Tollywood Hero’s : మన టాలీవుడ్ హీరోలు ఏం చదువుకున్నారో తెలుసా?

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ సినిమాకు ‘దేవర’ అని టైటిల్ పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఊర మాస్ లుక్‌లో ఎన్టీఆర్ ఆశ్చర్యపరిచారు. ఈ ఊర మాస్ లుక్‌ను ఎన్టీఆర్ అభిమానులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. లుక్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా చేయనున్నారు. ఎన్టీఆర్ 40వ బర్త్ డే(మే 20) సందర్భంగా దేవర సినిమా లుక్‌ను విడుదల చేశారు.

Exit mobile version