Site icon HashtagU Telugu

NTR : వార్ 2లో ఎన్టీఆర్‌కి జోడిగా ఆ హీరోయిన్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..

Hrithik Roshan War 2 Movie Team Selecting That Actress For Ntr

Hrithik Roshan War 2 Movie Team Selecting That Actress For Ntr

NTR : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రాల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్ 2’ సినిమా ఒకటి. బాలీవుడ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో రా ఏజెంట్ గా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో హృతిక్ కి జోడిగా అందాల భామ కియారా అద్వానీ కనిపించబోతున్నారు. అయితే ఎన్టీఆర్ సరసన ఎవరు నటించబోతున్నారు అనేదే ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఈ విషయం పై బాలీవుడ్ లో ఇప్పటికే పలు పేర్లు వినిపిస్తూ వచ్చాయి.

మొన్నటివరకు బాలీవుడ్ భామ శార్వరి ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా కనిపించనుందని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మరో పేరు వినిపిస్తుంది. నేషనల్ అవార్డు విన్నర్ అలియా భట్, ఎన్టీఆర్ కి జోడిగా కనిపించబోతున్నారట. ఇటీవల హాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ చిత్రంలో అలియా యాక్షన్ సీన్స్ చేసి వావ్ అనిపించారు. దీంతో ఈమెను ఇప్పుడు ఈ ఇండియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లోకి తీసుకోవాలని మూవీ టీం భావించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్ లో ఈ వార్త వైరల్ గా మారింది.

కాగా ఎన్టీఆర్ అండ్ అలియా కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆల్రెడీ నటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ చిత్రంలో అలియా, ఎన్టీఆర్ కి జోడిగా కనిపించలేదు. కానీ ఆ మూవీ ప్రమోషన్స్ సమయంలో మాత్రం తమ ఫ్రెండ్‌షిప్ తో ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. దీంతో ఈ జోడీని ఒకసారైనా స్క్రీన్ పై హీరోహీరోయిన్స్ గా చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఆశ పడుతున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో ఈ వార్తలు వినిపించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఫ్యాన్స్ ఆశ పడినట్లు ఈ జోడి నిజంగానే స్క్రీన్ పై కనిపిస్తుందో లేదో చూడాలి.

Also read : Race Gurram : ‘రేసుగుర్రం’లో మూడు పాత్రలకు.. డబ్బింగ్ చెప్పింది ఒకరే.. ఆ నటుడు ఎవరో తెలుసా?