Site icon HashtagU Telugu

Hrithik Roshan: హృతిక్ రోషన్‌కు మహిళ లవ్ ప్రపోజ్.. వీడియో వైరల్

Hrithik Roshan

New Web Story Copy 2023 06 24t195403.902

Hrithik Roshan: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వయసుతో సంబంధం లేకుండా హృతిక్ ని ఇష్టపడతారు. హృతిక్ మంచి నటుడిగానే కాకుండా అద్భుతమైన డ్యాన్స్ తో ఆకట్టుకుంటాడు. ఇక తాజాగా హృతిక్ కి ఆసక్తికర సంఘటన ఒకటి ఎదురైంది.

ఓ మహిళ హృతిక్ దగ్గరకు వచ్చి సార్ నేను మీకు వీరాభిమానిని అని చెప్పింది. దానికి హృతిక్ చాలా గౌరవంగా ఫీల్ అయ్యాడు. అయితే ఆ మహిళ ఓ అడుగు ముందుకేసి నేను మీకంటే ముందుగానే పుట్టాను. నా వయసు మీకంటే పెద్దదని, లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చూసుకునేదాన్ని అంటూ ఆ మహిళ అనడంతో హృతిక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే ఆ మహిళ చెప్పిన విషయాలకు గౌరవం ఇచ్చి థాంక్యూ అని చెప్తూ.. మీరు పెళ్లి చేసుకున్నారా అని హృతిక్ ఆమెను అడగగా ఆమె అవును అని చెప్పింది. అయితే వయస్సు సమస్య కాదని, నేను కూడా చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్నాను అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక మీమెర్స్ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ మొదలుపెట్టారు.

హృతిక్ రోషన్ విక్రమ్ వేద’ ఈ మధ్యే విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.ప్రస్తుతం హృతిక్ ప్రాజెక్టులలో ‘యుద్ధం 2’, ‘క్రిష్ 4’ మరియు ‘ఫైటర్’ ఉన్నాయి. ఫైటర్‌లో దీపికా పదుకొణె, అనిల్ కపూర్‌లతో కలిసి నటించనున్నారు. ‘క్రిష్ 4’ చిత్రానికి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించనుండగా, ‘యుద్ధం 2’ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు కియారా అద్వానీ నటించబోతున్నట్టు తెలుస్తుంది.

Read More: Orange : రామ్‌‌చరణ్‌ ‘ఆరెంజ్‌’ మూవీ టైటిల్‌ వెనుక ఉన్న కథేంటో తెలుసా..?

Exit mobile version