Site icon HashtagU Telugu

NTR : ఎన్టీఆర్ నుండి ఎన్నో నేర్చుకున్న – హృతిక్‌ రోషన్‌

Hruthik Ntr

Hruthik Ntr

ఎన్టీఆర్‌ (NTR) ‘వార్ 2’ (War 2)సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ‘వార్’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan)తో కలిసి తారక్ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటుండడం విశేషం. యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను 2025 ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Rana With Pak Army : పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరేతో రాణాకు లింకులు

ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్న హృతిక్‌ రోషన్.. ‘వార్ 2’ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంటూ తారక్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా తన కెరీర్‌లో అత్యంత తేలికగా జరిగిన షూటింగ్ అని, అన్ని షెడ్యూల్స్ కూడా అత్యంత ప్లాన్‌గా జరిగాయని తెలిపారు. దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఈ సినిమాతో నిజంగా మ్యాజిక్ చేశాడని, తనను సర్‌ప్రైజ్ చేశాడని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పని చేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఆయనతో పనిచేయడం గొప్ప అనుభూతిని మిగిల్చిందని అన్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా కనిపించనున్నారని టాక్. హృతిక్, తారక్ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ సినిమాలో హైలైట్‌గా నిలవబోతున్నాయని సమాచారం. అంతేగాక వీరిద్దరి మధ్య ఓ భారీ డ్యాన్స్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించారని, దాదాపు 500 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారని వార్తలు వచ్చాయి. ఈ సాంగ్ RRRలోని ‘నాటు నాటు’ లెవెల్ లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. బాలీవుడ్ స్టార్‌లైన సల్మాన్, షారుఖ్‌, హృతిక్‌ల సరసన ఇప్పుడు తారక్ కూడా స్పై యూనివర్స్‌లో ఏజెంట్‌గా మారుతుండటం తెలుగు ప్రేక్షకుల్లో గర్వంగా మారుతోంది.