Site icon HashtagU Telugu

Hrithik: ఈ మార్పు సినిమా కోసం కానే కాదు అంటున్న హృతిక్.. ఇంతకీ ఏమిటా మార్పు?

Hrithik

Hrithik

హృతిక్ రోషన్ కీలక ప్రకటన చేశారు. తాను బాడీని బిల్డ్ చేసేది సినిమాల కోసం కాదని.. జీవన శైలిలో దాన్ని భాగంగా మార్చుకున్నానని తెలిపారు. అంతేకాదు తాను జిమ్ వర్క్ అవుట్స్ చేస్తున్న కొన్ని ఫోటోలను 48 ఏళ్ల హృతిక్ రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. దీంతో అవి వైరల్ గా మారాయి. ఎంతోమంది సెలిబ్రిటీలు దీనిపై కామెంట్స్ పెట్టారు. హృతిక్ రోషన్ కు దగ్గర మెసులుకునే వారు.. జిమ్ వ్యవహారాలను దగ్గర నుంచి చూసేవారు తమ విశ్లేషణ అందించారు. వివరాలు ఇవీ..

హృతిక్ రోషన్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ పై ఫిట్‌నెస్ ఔత్సాహికుడు, నటుడు అనిల్ కపూర్.. “ఇదిగో నిజమైన పోరాట యోధుడు” అని కామెంట్ పెట్టారు. నటుడు, హోస్ట్ కరణ్ టాకర్.. “సరే, అది అలా జరిగిందన్న మాట” అని పేర్కొన్నారు.నటుడు వరుణ్ ధావన్ కూడా హై-ఫైవ్ ఎమోజీతో “సరే అయితే” అని వ్యాఖ్యానించారు. హృతిక్ రోషన్ ఫిట్‌నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ కూడా ఒక కామెంట్ పెట్టారు.” ఈ ఫోటోలు హృతిక్ యొక్క 12 వారాల మజిల్ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం లో 8వ వారంలోనే తీసినవి. ఇంకా నాలుగు వారాలు మిగిలే ఉన్నాయి. ఇది ఆరంభం మాత్రమే’’ అని క్రిస్ గెతిన్ వెల్లడించాడు.

యూట్యూబ్ ఇంటరాక్షన్ లో హృతిక్ ఏమన్నాడంటే..

ఇక ఈ 12 వారాల జిమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేయడం గురించి హృతిక్ రోషన్ , జిమ్ ట్రైనర్ గెతిన్‌తో యూట్యూబ్ వేదికగా ఇంటరాక్ట్ అయ్యారు. ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. 12 వారాల జిమ్ ట్రైనింగ్ ప్రోగ్రాం చాలా ఆకర్షణీయంగా, వినోదాత్మకంగా గడిచిందని హృతిక్ రోషన్ చెప్పారు. ఈ మార్పును జీవితంలో ఇలాగే కొనసాగించాలన్నది తన లక్ష్యమన్నారు. ఈవిధమైన బాడీ లాంగ్వేజ్ పొందాలని తాను గత నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.”2019లో నేను టైగర్ ష్రాఫ్‌తో  కలిసి  నటించిన వార్ మూవీ నాలోని శారీరక సామర్థ్యాలను బయటికి చూపించింది” అని వివరించారు.

గతం గుర్తు చేసిన గెతిన్‌..

“సెలబ్రిటీలు జిమ్ బాడీ పొందటం అంత సులభం కాదు. నేను గతంలో 2013లో రోషన్‌ కు జిమ్ ట్రైనింగ్ ఇచ్చాను. నాకు బాగా గుర్తుంది. హృతిక్ వరుసగా ఏడు నెలలు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా వర్క్ అవుట్స్ చేశారు. కొన్నిసార్లు ఉదయం 4 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు హృతిక్ వర్క్ అవుట్స్ చేసేవారు.  ఇది అలసిపోయే పని. కానీ హృతిక్ ఎల్లప్పుడూ తన లక్ష్యాలను చేధించేవాడు .రోజూ భోజనం తిని, త్వరగా పడుకుంటాడు.  కొన్నిసార్లు అతను రాత్రి షిఫ్టులలోనూ కష్టపడేవాడు. కానీ జిమ్ వర్క్ అవుట్స్ మిస్ చేయలేదు ” హృతిక్ రోషన్
జిమ్ ట్రైనర్ గెతిన్‌ వివరించారు.

రోజుకు ఆరు సార్లు..

“హృతిక్ రోజుకు ఆరు సార్లు భోజనం చేస్తున్నాడు. మజిల్ బిల్డింగ్ జరగాలంటే అంతగా ఫుడ్ తీసుకోవాల్సిందే. ప్రోటీన్స్ కోసం పౌల్ట్రీ, చేపలు, గుడ్డులోని తెల్లసొన, ప్రోటీన్ పౌడర్, బంగాళదుంపలు, చిలగడదుంపలు, బియ్యం, వోట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాడు. కొద్దిగా రోటీని , ప్రోటీన్ షేక్ తీసుకుంటాడు”అని జిమ్ ట్రైనర్ గెతిన్‌ చెప్పారు.