Site icon HashtagU Telugu

Venkatesh : వెంకటేష్‌కి ‘విక్టరీ’ అన్న బిరుదు ఎప్పుడు, ఎలా వచ్చిందో తెలుసా..?

How Victory tite comes to Venkatesh story here

How Victory tite comes to Venkatesh story here

టాలీవుడ్(Tollywood) సీనియర్ హీరో వెంకటేష్(Venkatesh).. మూవీ మొఘల్ రామానాయుడు(Rama Naidu) వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఎంతోమంది స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) వెంకటేష్ ని ‘కలియుగ పాండవులు’(Kaliyuga Pandavulu) సినిమాతో తెలుగు ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు. 1986 ఆగష్టు 14న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో వెంకటేష్ కి జోడిగా కుష్బూ (Kushboo) నటించింది. ఇక ఈ సినిమాతోనే వెంకటేష్ ‘విక్టరీ’ అనే బిరుదుని అందుకున్నాడు.

ఇంతకీ ఆ బిరుదు ఎలా వచ్చిందంటే.. ఆ సినిమాలో వెంకటేష్ చెప్పిన ఒక డైలాగ్ వల్ల ఆ బిరుదు వచ్చింది. కలియుగ పాండవులు చిత్రంలోని ఒక సన్నివేశంలో వెంకటేష్ అతని స్నేహితులతో.. “వి ఫర్‌ విక్టరీ అన్నది ఒకప్పటి సామెత. విజయ్‌ ఫర్‌ విక్టరీ అన్నది నేను సృష్టించిన సామెత” అని చెబుతాడు. ఆ డైలాగ్ మంచి ఫేమస్ అయ్యింది. ఇక మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడం, ఆ తరువాత చిత్రాలతో కూడా విజయాలు అందుకుంటూ వెంకటేష్ ముందుకు సాగడంతో.. విక్టరీ అనేది వెంకటేష్ ఇంటి పేరుగా మారిపోయింది. అయితే ఈ బిరుదు మొదటి సినిమా నుంచే తీసుకున్నారని సమాచారం.

కాగా వెంకటేష్ ఇటు క్లాస్ ఆడియన్స్ ని, అటు మాస్ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. చంటి, రాజా, కలుసుందాం రా సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన వెంకటేష్.. గణేష్, బొబ్బిలిరాజా, జయం మనదేరా, కూలీ నెంబర్ 1, తులసి వంటి మాస్ చిత్రాలతో ఇండస్ట్రీలో సంచలనాలు కూడా సృష్టించాడు. ఇక ఇటీవల రానా నాయుడు (Rana Naidu) వెబ్ సిరీస్ లో నటించి అందరికి పెద్ద షాక్ ఇచ్చాడు. ఫ్యామిలీ హీరోగా ఎంతో ఇమేజ్ ని సొంతం చేసుకున్న వెంకటేష్.. ఆ సిరీస్ లో బోల్డ్ పాత్రలో కనిపించి విమర్శలు ఎదుర్కున్నాడు. ఈ సిరీస్ కి ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా తీసుకు రాబోతున్నాడు.

 

Also Read : Kantara 2 Update: కాంతార-2కు ముహూర్తం సిద్ధం, త్వరలోనే షూటింగ్ షురూ!