IT Raids: వైట్ ఎంత‌? బ్లాక్ ఎంత? ప్రభాస్, అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ పై ఐటీ ఆరా!

మైత్రి మూవీ మేకర్స్‌పై ఐటీ శాఖ గతకొద్దిరోజులుగా నజర్‌ పెంచింది.

  • Written By:
  • Updated On - April 24, 2023 / 02:41 PM IST

టాలీవుడ్ (Tollywood) పై వరుసగా ఐటీ దాడులు (IT Raids) చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో మైత్రి మూవీస్, దర్శకుడు సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా ఐటీ బృందాలు సోదాలు జరుపుతున్నారు. పుష్ప 1 సినిమా బడ్జెట్, వసూలు చేసిన కలెక్షన్లు, పుష్ప 2 నిర్మాణానికి వెచ్చిస్తున్న బడ్జెట్ వివరాలు, నటీనటుల టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ఆదాయ పన్ను చెల్లింపులు, జీఎస్టీ (GST) చెల్లింపులు తదితర వివరాలను తెలుసుకుంటున్నారు ఐటీ అధికారులు. మైత్రి మూవీ మేకర్స్‌పై ఐటీ శాఖ గతకొద్దిరోజులుగా నజర్‌ పెంచింది. మైత్రి మూవీకి ముంబైతో ఉన్న లింకులపై అధికారులు ఆరా తీశారని తెలుస్తోంది.

అయితే మైత్రీ మూవీస్ ఇప్పుడు పెద్ద హీరోల‌తోనే (Big Stars) సినిమాలు చేస్తోంది. అగ్ర హీరోల పారితోషికం ఈరోజుల్లో 70- 80 కోట్ల‌కు త‌గ్గ‌డ‌మే లేదు. ముఖ్యంగా ప్ర‌భాస్ తో ఓ సినిమా ప్లాన్ చేసింది మైత్రీ మూవీస్‌. బాలీవుడ్ (Bollywood) ద‌ర్శ‌కుడు సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ తో పాటు కొంత‌మంది కీల‌క‌మైన టెక్నీషియ‌న్ల‌కు మైత్రీ అడ్వాన్స్ ఇచ్చేసింది.

ఆ వివ‌రాలు ఇప్పుడు ఐటీ చేతిలో ఉన్నాయి. ప్ర‌భాస్ (Prabhas) తో పాటుగా మైత్రీలో ప‌ని చేస్తున్న హీరోలంద‌రికీ ఎంతెంత పారితోషికాలు ఇచ్చారు, అందులో వైట్ ఎంత‌? బ్లాక్ ఎంత? అనే విష‌యాల‌తో స‌హా.. అన్ని వివ‌రాలూ ఐటీ రాబ‌ట్టింది. పుష్ప సినిమా ఊహించని విధంగా సూపర్ హిట్ కావడం, అల్లు అర్జున్ పుష్ప-2కు 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని టాక్ రావడం కూడా ఐటీ ద్రుష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ పారితోషికం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు హీరోల‌పై ప‌డే ప్ర‌మాదం ఉంది. హీరోలు సైతం త‌మ పారితోషికాన్ని (Salary) త‌గ్గించి చూపించి, ప‌న్ను ఎగ్గొడితే… ఇప్పుడు ఈ హీరోలు సైతం పెనాల్టీ క‌ట్టాల్సివ‌స్తుంది. ఐటీ దాడుల నేపథ్యంలో పలువురి హీరోల వాట్సాప్ చాట్ ఐటీ (IT)కి చిక్కినట్టు తెలుస్తోంది.

Also Read: Software Couple: సంసారానికి సమయం కేటాయిస్తున్నారా.. సాఫ్ట్ వేర్ జంటకు ‘సుప్రీంకోర్టు’ ప్రశ్న!