అలియా కోసం అంత ఖర్చు పెడుతున్నారా..!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి వైరల్ గా మారింది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ కోసం చిత్రనిర్మాతలు 6 కోట్లు ఖర్చు చేయనున్నట్లు, ఇందులో అలియా రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో పోటాపోటీగా డాన్స్ చేయనునట్లు టాలీవుడ్ టాక్.

  • Written By:
  • Updated On - September 29, 2021 / 03:31 PM IST

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత ఈ మూవీ వస్తుండటంతో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీనే కాదు.. ఇంటర్నేషన్ మూవీ కూడా అని చెప్పక తప్పదు. ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త అయినా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ మారుతోంది. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఈ సినిమాలో నటిస్తున్న విషయం విధితమే.

తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ టీం ఓ ప్రమోషనల్ సాంగ్ ను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రధానంగా అలియా భట్ పై పాట చిత్రీకరణ ఉంటుందట. అంతేకాదు.. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ సైతం ఈ పాటలో స్టెప్పులు వేయనున్నారు. టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్స్ గా పేరు తెచ్చుకున్న రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకే పాటలో డాన్స్ చేయడం ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇస్తోంది. ఇప్పటికే ఈ ప్రమోషనల్ సాంగ్ కోసం వారం రోజులుగా ప్రాక్టీస్ కూడా చేశారట. అయితే ఈ ఒక్క పాటకే ఆర్ఆర్ఆర్ నిర్మాతలు 6 కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ.. చెర్రీ, ఎన్టీఆర్ లు సినిమాలో అపొసిట్ క్యారెక్టర్ చేస్తున్నప్పటికీ బయట మాత్రం వాళ్లిద్దరు మంచి స్నేహుతులు అని గుర్తు చేశారు. ఒకరు నిప్పు అయితే, మరొకరు నీరు అని పోల్చారు. గతంలో ఇద్దరితోనూ హిట్స్ కొట్టానని, ఇప్పుడు ఇద్దరి కలయికలో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ హిట్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఈ సినిమాను ఈ దసర పండుగ సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు భావించారు. కానీ, అనుకోని కారణాల వల్ల.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్. అయితే ఈ సినిమాను దసరాకు కాకుండా సంక్రాంతికి విడుదల చేస్తున్నారట. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాకపోయానా…ఇదే ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.