How Many Times Pappa (Nanna) Word Used in Animal : యానిమల్ సినిమాలో పప్పా కౌంట్.. నాన్న అనే పదాన్ని ఎన్నిసార్లు వాడారో తెలుసా..?

How Many Times Pappa (Nanna) Word Used in Animal రణ్ బీర్ కపూర్, సందీప్ వంగ కాంబోలో వచ్చిన సెన్సేషనల్ మూవీ యానిమల్ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని లేటెస్ట్ గా ఓటీటీలో

Published By: HashtagU Telugu Desk
Animal

Animal

How Many Times Pappa (Nanna) Word Used in Animal రణ్ బీర్ కపూర్, సందీప్ వంగ కాంబోలో వచ్చిన సెన్సేషనల్ మూవీ యానిమల్ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని లేటెస్ట్ గా ఓటీటీలో రిలీజైంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా ఈ సినిమా హంగామా చేస్తుంది. సినిమా థియేటర్ లో మిస్సైన వారంతా కూడా ఓటీటీలో చూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో ఉంటుంది.

We’re now on WhatsApp : Click to Join

ఇదిలాఉంటే సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వగానే మీమ్స్ చేసే వాళ్లకు మంచి స్టఫ్ దొరికినట్టు అయ్యింది. యానిమల్ సినిమా అసలే అడల్ట్ డోస్ ఎక్కువైందని టాక్ వచ్చింది. ఆ సినిమా గురించి రకరకాల మీమ్స్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఒక ట్వీట్ వైరల్ గా మారింది. అదేంటి అంటే సినిమాలో మొత్తం పప్పా అదే నాన్న అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో కౌంట్ చేశారు.

1 నుంచి ఏ సీన్ లో ఎలా నాన్న అని పిలుస్తాడో సీన్ టు సీన్ కట్ చేసి ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దాదాపు నిమిషన్నర పైన ఉన్న ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు యానిమల్ సినిమాలో మొత్తం 198 సార్లు నాన్న అనే పదం వినిపించింది. ఒక సినిమా గురించి ఇంత డీటైల్డ్ గా చెప్పడం ఇలాంటి మీమ్ క్రియేటర్స్ వల్లే అవుతుంది.

Also Read : Trivikram New Look : గురూజీ కొత్త లుక్.. చాన్నాళ్ల తర్వాత గడ్డెం లేకుండా..!

యానిమల్ సినిమా ఫాదర్ అండ్ సన్ ఎఫెక్షన్ అండ్ ఎమోషనల్ సినిమా అని తెలిసిందే. అందుకే ఈ సినిమాలో పప్పా (నాన్న) అనే పదాన్ని అన్నిసార్లు వాడారు.

  Last Updated: 27 Jan 2024, 09:17 PM IST