Site icon HashtagU Telugu

Chiranjeevi: ఏంటి.. సునీల్ బతికి ఉండడానికి కారణం చిరంజీవినా.. ఆ రోజు ఏం జరిగిందంటే?

Chiranjeevi

Chiranjeevi

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసి రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాస్టార్. ఎంతోమందికి అండగా నిలిచి ప్రోత్సాహాన్ని కల్పించారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవికి కార్లు అంటే పిచ్చి. ఈ విషయాన్ని చిరంజీవి చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అప్పట్లో చిరంజీవి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక కారు ఉండేదట. అందుకు గల కారణం జూబ్లీహిల్స్ పట్టణానికి చాలా దూరంగా ఉండేదట.

ఇప్పుడు ఏ సమయంలో ఏ అవసరం వస్తుందో తెలియదని అందుకే ఇంట్లో అన్ని కార్లు ఉంటాయి అని మెగాస్టార్ తెలిపారు. అయితే ప్రస్తుతం రూ. 11 కోట్ల విలువైన రోల్స్‌ రాయల్స్‌ కారును ఉపయోగిస్తున్న చిరుకు ఒకప్పుడు మాత్రం ల్యాండ్ క్రూజర్‌ చాలా ఇష్టమట. అత్యంత భద్రత ఉండే ఎస్‌యూవీ కారు కావడంతో దానికి ఆయన మొగ్గు చూపారట. తెలిసిన ఒక స్నేహితుడు ల్యాండ్‌ క్రూయిజ్‌ ను కొనుగోలు చేస్తే కొన్ని రోజులు వాడుకొని ఇస్తానని ఆ కారును తీసుకున్నారట చిరు. అప్పట్లోనే ఈ కారులో ఎన్నో రకాల భద్రతా ఫీచర్లు ఉండేవి. ఎల్‌ఈడీ డ్యాష్‌ బోర్డ్‌, బ్యాక్‌ కెమెరా వంటి ఫీచర్స్‌ కూడా ఉండేవట.

జీవితంలో ల్యాండ్ క్రూయిజ్‌ కచ్చితంగా కొంటానని ఆ సమయంలో చిరు తెలిపారు. ఇప్పుడు అలాంటి కార్లను దాదాపు ఒక 100 కొనుగోలు చేసే స్థాయికి ఎదిగారు మెగాస్టార్. ల్యాండ్ క్రూయిజర్‌ కారణం గుర్తు చేసుకుంటూ ఒక విషయాన్ని చెప్పారు చిరంజీవి. ఈ కారును హీరో శ్రీకాంత్ కొనుగోలు చేశారట. అయితే ఒక సారి సునీల్‌ తన సొంతూరుకు వెళ్లేందుకు శ్రీకాంత్‌ కారు తీసుకెళ్లారట సునీల్‌ కారులో వెళ్తున్నప్పుడు ఘోర ప్రమాదం జరిగిందట. కారు పూర్తిగా ధ్వంసం అయినప్పటికీ అందులో ఉన్నవారికి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదట. దీనికి ప్రధాన కారణం ల్యాండ్ క్రూయిజర్‌ లో ఉన్న భద్రతా ఫీచర్లే అని చిరు తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన కొన్ని రోజుల తర్వాత చిరును కలిసిన సునీల్‌ కారులో ప్రయాణం మొదలు పెట్టిన కాసేపటికి హైవేపైకి ఎక్కగానే డ్రైవర్‌తో మాట్లాడుతూ.. చిరంజీవి గారు కచ్చితంగా సీల్ట్‌ బెల్ట్‌ ధరించమని చెబుతుంటారని చెప్పి ఇద్దరూ బెల్ట్ వేసుకున్నారట. అలా బెల్ట్‌ వేసుకున్న కాసేపటికే కారు ప్రమాదానికి గురైనట్లు చెప్పాడట. మేము బతికి బయటపడ్డామంటే దానికి మీరు చెప్పిన సలహానే కారణం అని చిరంజీవితో ఈరోజు సునీల్ చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారట.