BiggBoss Telugu : బిగ్ బాస్ హోస్ట్ మారుతున్నాడా.. ఇది కూడా అన్ స్టాపబులే..!

Bigg Boss Telugu బిగ్ బాస్ తెలుగుకి మొదటి సీజన్ ఎన్.టి.ఆర్, రెండో సీజన్ నాని హోస్ట్ గా చేశాడు. 3వ సీజన్ నుంచి జరుగుతున్న 7వ సీజన్

Published By: HashtagU Telugu Desk
Host Changing For Bigg Boss Telugu Nandamuri Balakrishna New Host For Bb Telugu

Host Changing For Bigg Boss Telugu Nandamuri Balakrishna New Host For Bb Telugu

Bigg Boss Telugu బిగ్ బాస్ తెలుగుకి మొదటి సీజన్ ఎన్.టి.ఆర్, రెండో సీజన్ నాని హోస్ట్ గా చేశాడు. 3వ సీజన్ నుంచి జరుగుతున్న 7వ సీజన్ వరకు నాగార్జున సింగిల్ హ్యాండ్ తో నడిపిస్తున్నాడు. హోస్ట్ గా నాగార్జునకు ఎన్ని మార్కులు అన్నది చెప్పాల్సిన లేదు. మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా తను సత్తా చాటగలనని ప్రూవ్ చేసుకున్నాడు నాగార్జున.

బిగ్ బాస్ సీజన్ 3 నుంచి సీజన్ 7 మధ్యలో ఒక ఓటీటీ సీజన్ అంటే ఆరు సీజన్లకు కంటిన్యూస్ గా నాగార్జున హోస్ట్ గా చేస్తూ వచ్చారు. ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 7 లో కూడా వీకెండ్ నాగార్జున (Nagarjuna) షో అదిరిపోతుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 8కి మాత్రం హోస్ట్ మారుతున్నాడని లేటెస్ట్ టాక్. అసలైతే సీజన్ 7 కే కొత్త హోస్ట్ ని తీసుకు రావాలని బిగ్ బాస్ టీం బాగా ట్రై చేసింది కానీ చివరకు నాగార్జుననే ఫిక్స్ చేశారు.

Also Read : Lavanya : ఆఫ్టర్ మ్యారేజ్ మెగా కోడలు సినిమాలు చేస్తుందా..?

ఈ సీజన్ మొదలయ్యే ముందే నాగార్జున క్లియర్ కట్ గా నెక్స్ట్ సీజన్ తను చేయడం కుదరదని చెప్పేశారట. అందుకే బిగ్ బాస్ టీం నెక్స్ట్ హోస్ట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ బిగ్ బాస్ హోస్ట్ చేస్తారని చెబుతున్నారు.

ఈమధ్యనే ఆహా అన్ స్టాపబుల్ (Un Stoppable) టాక్ షోతో తను హోస్ట్ గా కూడా అదరగొట్టగలనని ప్రూవ్ చేశాడు బాలయ్య బాబు. అందుకే బిగ్ బాస్ టీం బాలకృష్ణ (Balakrishna)ని సంప్రదించిందట. దాదాపు నెక్స్ట్ సీజన్ బాలకృష్ణనే బిగ్ బాస్ హోస్ట్ గా వస్తారని టాక్.  అదే జరిగితే మాత్రం అన్ స్టాపబుల్ రేంజ్ లోనే బిగ్ బాస్ సీజన్ 8 కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 02 Nov 2023, 01:14 PM IST