Honey Rose and Manchu Lakshmi: వామ్మో.. హనీరోజ్, మంచు లక్ష్మీ ఏ రేంజ్ లో రొమాన్స్ చేశారో చూశారా!

మాన్ స్టర్ మూవీలో మంచు లక్ష్మీ, హనీరోజ్ ఓ రేంజ్ లో రొమాన్స్ చేశారు. లెస్బియన్స్ గా కనిపించి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపర్చారు.

Published By: HashtagU Telugu Desk
Manchu Laxmi

Manchu Laxmi

టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (Manchu Laxmi) మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మాన్‌స్టర్ (Monstor) మూవీలో లెస్బియన్ (Lesbian) పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే లెస్బియన్ పాత్రలో మొదటిసారి నటించి అందరీ ద్రుష్టి ఆకట్టుకుంది. అయితే ఇటీవల వీరసింహారెడ్డి మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది హనీరోజ్. అంతకుముందే మాన్ స్టర్ మూవీలో నటించింది ఈ బ్యూటీ. హనీరోజ్ మంచు లక్ష్మీతో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది. లెస్బియన్స్ గా కనిపించి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపర్చారు వీరిద్దరు. అయితే వీళ్లిదరి మధ్య కెమిస్ట్రీకి నెటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు. రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన ఈ మూవీలోని ఓ సాంగ్ లో హనీరోజ్, మంచు లక్ష్మీ లెస్బియన్స్ గా చక్కని నటనను ప్రదర్శించారు.

అయితే ఇటీవల టాలీవుడ్ లో హనీరోజ్ (Honey Rose) ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో మాన్ స్టర్ మూవీలో ‘హై ఆన్ డిసైర్’ అనే పాట మరోసారి ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాను ఆ క్యారెక్టర్ ఎందుకు ప్లే చేయాల్సి వచ్చిందో ఓపెన్ అయ్యింది మంచు లక్ష్మీ. “నేను లెస్బియన్ (Lesbian) పాత్రలో నటించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నా. ఎందుకంటే గతంలో ఇలాంటి క్యారెక్టర్ వేయలేదు. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అని భయపడినట్టు మంచు లక్ష్మీ (Manchu Laxmi) తెలిపారు.

“సినిమాలో నా మొత్తం పాత్రను వారు ఎలా స్వీకరిస్తారోనని మొదట్లో భయపడ్డాను. కానీ ఇప్పుడు నేను అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయి’’ అని లక్ష్మీ తెలిపారు. “కొందరు అలాంటి పాత్రలకు ఎందుకు దూరంగా ఉంటారో నేను గమనించాను. అయితే స్వలింగ సంపర్కం అనే టాపిక్ అసౌకర్య అంశంగా ఎందుకు మిగిలి ఉందని మీరు అనుకుంటున్నారు? అని మంచు లక్ష్మీ (Manchu Laxmi) ప్రశ్నించారు. నటిగా ఓ నాకు ఇలాంటి పాత్రలు వస్తే ఖచ్చితంగా చేస్తాను అని అంటోందీమె.

  Last Updated: 13 Feb 2023, 05:42 PM IST