Honey Singh: హనీ సింగ్‌కు కెనడా గ్యాంగ్‌స్టర్ హత్య బెదిరింపులు

ఇండియన్ సింగర్, రాపర్ హనీ సింగ్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. దీంతో హనీ సింగ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెనడాలో పనిచేస్తున్న గోల్డీ బ్రార్ అనే గ్యాంగ్‌స్టర్

Published By: HashtagU Telugu Desk
Honey Singh

New Web Story Copy 2023 06 21t202841.177

Honey Singh: ప్రముఖ సింగర్, రాపర్ హనీ సింగ్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. దీంతో హనీ సింగ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెనడాలో పనిచేస్తున్న గోల్డీ బ్రార్ అనే గ్యాంగ్‌స్టర్ నుంచి తనకు బెదిరింపులు వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హనీ సింగ్ బుధవారం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ స్పెషల్ సీపీని కలిశారు.

హనీ సింగ్ ఫిర్యాదు మేరకు ప్రత్యేక సెల్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. మరోవైపు భద్రత కల్పించాలని హనీ సింగ్ ఢిల్లీ పోలీసులను కోరాడు. నా మేనేజర్‌కి నన్ను చంపేస్తానని బెదిరింపు కాల్ వచ్చినప్పుడు, నేను ఆ సమయంలో అమెరికాలో ఉన్నాను అని హనీ సింగ్ చెప్పారు. దీనిపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశానని, విచారణ జరిపిస్తానని తెలిపారు. ప్రత్యేక సెల్ ఈ విషయాన్ని విచారిస్తుందని భావిస్తున్నాను. వారికి పూర్తి సమాచారం, ఆధారాలు ఇచ్చానన్నారు హానీ సింగ్.

ఇదిలా ఉండగా.. ప్రముఖ పంజాబ్ సింగర్ సిద్ధూ ముసేవాలా హత్య కేసులో గోల్డీ బ్రార్ కూడా ప్రధాన నిందితుడు గతంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను కూడా చంపేస్తానని బెదిరించాడు. ఈ ఏడాది మార్చిలో సల్మాన్‌ఖాన్‌కు ఈమెయిల్‌ పంపి బెదిరించాడు. ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు సల్మాన్‌ఖాన్ ఇంటికి భద్రతను పెంచారు.

Read More: Mutton Keema Samosa: మటన్ ఖీమా సమోసా తయారీ విధానం గురించి మీకు తెలుసా?

  Last Updated: 21 Jun 2023, 08:28 PM IST