Site icon HashtagU Telugu

Akhil : అఖిల్ తో K.G.F, సలార్ లాంటి సినిమా..?

Interesting Title for Akhil Next Movie

Interesting Title for Akhil Next Movie

Akhil ప్రభాస్ నటించిన సలార్ సినిమా సక్సెస్ పార్టీలో అఖిల్ అక్కినేని కనిపించడంతో మొదలైన డౌట్స్ రీసెంట్ గా వచ్చిన క్లారిటీతో ఎండ్ అయ్యాయి. ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ ఏ సినిమా చేస్తాడన్న కన్ ఫ్యూజన్ ఫ్యాన్స్ లో ఉంది. అయితే సలార్ టీం తో కలిసి కనిపించడం వల్ల సలార్ సెకండ్ పార్ట్ లో ప్రభాస్ ఉంటాడేమో అన్న డౌట్ వచ్చింది.

We’re now on WhatsApp : Click to Join

అయితే అందులో నిజం లేదని తెలుస్తుంది. ప్రభాస్ సలార్ 2లో అఖిల్ లేడు కానీ సలార్ నిర్మాతలతో అఖిల్ బిగ్ డీల్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

అఖిల్ తో హోంబలె ప్రొడక్షన్స్ సినిమా లాక్ అయ్యిందట. నూతన దర్శకుడు అనీల్ కుమార్ ఈ సినిమా చేస్తారని తెలుస్తుంది. పీరియాడికల్ కథతో రాబోతున్న ఈ సినిమాను కె.జి.ఎఫ్, సలార్ రేంజ్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు బ్యాచిలర్ సినిమా మాత్రమే సక్సెస్ అయ్యింది.

ఆ తర్వాత వచ్చిన సినిమా నిరాశపరచింది. అయితే అఖిల్ ఏజెంట్ ఎలాగు భారీ అటెంప్ట్ చేశాడు కాబట్టి అదే రేంజ్ లో మరో భారీ సినిమా చేస్తున్నారట.

అఖిల్ తో కె.జి.ఎఫ్ రేంజ్ లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట హోంబలె నిర్మాతలు. ఈ సినిమాకు ధీర అనే టైటిల్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. యువి క్రియేషన్స్ వారు ముందు ఈ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నా హోంబలె వారితో చేతులు కలిపి భారీగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట.

Also Read : Teja Sajja Dulquer Salman Manchu Manoj : నెక్స్ట్ బిగ్ మల్టీస్టారర్ ఇదేనా..?

అఖిల్ టాలెంట్ కి తగిన సక్సెస్ ఇప్పటివరకు రాలేదు మరి ఈ సినిమా అయినా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా తో పాటుగా అఖిల్ మరో రెండు ప్రాజెక్ట్ లు డిస్కషన్స్ లో పెట్టాడని తెలుస్తుంది.