NTR 30: తారక్‌ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌..!

ఎన్టీఆర్ 30' (NTR 30) సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత తారక్‌ చేస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

  • Written By:
  • Updated On - March 26, 2023 / 01:51 PM IST

‘ఎన్టీఆర్ 30’ (NTR 30) సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత తారక్‌ చేస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అంతేకాదు జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ అవుతుండటంతో అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఆచార్య వల్ల కోలుకోలేని దెబ్బ తిన్న కొరటాల శివ.. ఈ సినిమాతో మళ్లీ గ్రాండ్‌గా రావాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

ఇదిలావుంటే, కొరటాల ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్‌ని తీసుకున్నాడు. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ చిత్రంలో భాగమని పేర్కొంటూ చిత్ర బృందం ఈ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది. మిషన్ ఇంపాజిబుల్ వంటి చిత్రాలకు పనిచేసిన కెన్నీ ఈ చిత్రంలో భాగం కావడంతో తారక్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Also Read: Ram Charan Birthday: RC15 సెట్స్ లో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు.. స్పెషల్ అట్రాక్షన్ గా చెర్రీ..!

ద్వీపం, ఓడరేవు నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. ఇంకా, ఈ చిత్రం సెమీ పీరియడ్ సెటప్‌తో కల్పిత ద్వీపంలో జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో పడవలో సెట్ చేయబడిన యాక్షన్ సీక్వెన్స్‌ను కాన్సెప్ట్ చేసి, డిజైన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెన్నీ బేట్స్ ఇంతకుముందు ఎస్ శంకర్ రజనీకాంత్ రోబో 2.O, 2019లో విడుదలైన ప్రభాస్ నటించిన సాహోతో సహా అత్యంత ప్రసిద్ధ భారతీయ చిత్రాలకు కొరియోగ్రఫీని నిర్వహించారు.

ఈ మూవీలో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన జాన్వీ ఫస్ట్‌ లుక్‌ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఇక జాన్వీకి తొలి తెలుగు సినిమా ఇదే అవడం విశేషం. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.