Hollywood Movies : హాలీవుడ్ సినిమాలు ఇండియాలో 100 కోట్లు.. ఓపెన్‌ హైమర్‌, మిషన్ ఇంపాజిబుల్ 7 హవా..

ఈ నెల జులైలో చెప్పుకోదగ్గ హాలీవుడ్ సినిమాలు మిషన్ ఇంపాజిబుల్ 7(Mission Impossible 7), బార్బీ(Barbie), ఓపెన్‌ హైమర్‌(Oppenheimer) రిలీజ్ అయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Hollywood Movies Mission Impossible 7 and Oppenheimer collects 100 crores collections in India

Hollywood Movies Mission Impossible 7 and Oppenheimer collects 100 crores collections in India

హాలీవుడ్ సినిమాలకు(Hollywood Movies) ఇండియా(India)లో మంచి మార్కెట్ ఎప్పుడూ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని హాలీవుడ్ సినిమాలు ఇండియా మార్కెట్ లో రిలీజ్ అవుతాయి. ఇటీవల ఇండియన్ సినిమాలకు ప్రపంచ ఆదరణ పెరగడంతో హాలీవుడ్ సినిమాలని కూడా ఇక్కడ మరింత మార్కెట్ చేస్తున్నారు. ఇక్కడి లోకల్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు హాలీవుడ్ సినిమాలని. ఈ నెల జులైలో చెప్పుకోదగ్గ హాలీవుడ్ సినిమాలు మిషన్ ఇంపాజిబుల్ 7(Mission Impossible 7), బార్బీ(Barbie), ఓపెన్‌ హైమర్‌(Oppenheimer) రిలీజ్ అయ్యాయి.

ఈ సినిమాలన్నిటికీ ఇండియాలో మంచి ఆదరణ దొరికింది. హాలీవుడ్ స్టార్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్ కి ఇండియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాక అతని గత సినిమాలు మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లు అన్ని ఇండియాలో సూపర్ హిట్ అయ్యాయి. దీంతో జులై 12న విడుదలైన మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ 1 సినిమా తాజాగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. సినిమా రిలీజయి మూడు వారాలు అవుతున్నా ఇంకా కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి.

ఇక హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ కి కూడా ఇండియాలో మంచి ప్రజాదరణ ఉంది. అతని గత సినిమాలు కూడా ఇక్కడ మంచి విజయం సాధించాయి. దీంతో తాజాగా క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్‌ హైమర్‌ సినిమా ఇండియాలో జులై 21 న రిలీజయింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆట‌మ్ బాంబు తయారీ నేపథ్యంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించింది. ఇండియాలో కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. సినిమా రిలీజయిన పది రోజులకే ఓపెన్‌ హైమర్‌ ఇండియాలో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇక మరో హాలీవుడ్ సినిమా బార్బీ కూడా ఇప్పటికే ఇండియాలో 50 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. మనమంతా హాలీవుడ్ మార్కెట్ కోసం ప్రయత్నిస్తుంటే వాళ్ళు ఇండియన్ మార్కెట్ కి వచ్చి సంపాదించుకుంటున్నారు.

 

Also Read : Vaishnavi : బేబీ ని కలిసిన పవన్ డైరెక్టర్..ఛాన్స్ ఇచ్చినట్లేనా..?

  Last Updated: 30 Jul 2023, 06:33 PM IST