Site icon HashtagU Telugu

Chiru-Keeravani: హిట్ కాంబినేషన్ రిపీట్.. దాదాపు 29 ఏళ్ల తర్వాత!

Hit Combo

Hit Combo

చిరంజీవి, కీరవాణిలది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఘరానా మొగుడు’, ‘ఆపద్బాంధవుడు’, ‘ఎస్.పి. పరశురాం’. చిరంజీవి కీరవాణి అందించిన సంగీతం కాస్త స్పెషల్ అని చెప్పాలి. కొన్నాళ్లకు ఈ కాంబినేషన్ సెట్ అయింది. చాలా కాలంగా మణిశర్మ, ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్, ఇటీవల తమన్ కూడా సంగీతం అందిస్తున్నారు.

అయితే చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్‌’కి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్‌ సంగీతం అందించారు. అయితే చిరంజీవి, కీరవాణి కాంబో రిపీట్ అవుతుందనే వార్తలు కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి. చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే.

బింబిసార విజయంలో కీరవాణి పాత్ర చాలా పెద్దది. అందుకే దర్శకుడు వశిష్ఠ అతడిని తన తదుపరి చిత్రంలో కొనసాగించాలనుకుంటున్నాడు. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతమిస్తేనే వందశాతం న్యాయం జరుగుతుందని చిరంజీవి కూడా కీరవాణికే ఓటేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘ముల్లోక వీరుడు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఇందులో ఎనిమిది మంది హీరోయిన్లకు స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తుంది.

Also Read: Late Nights: ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Exit mobile version