Site icon HashtagU Telugu

Box Office : నాని – సూర్య బిగ్ ఫైట్ ..మరి హిట్ కొట్టేది ఎవరో..?

Retro Vs Hit3

Retro Vs Hit3

ఈ వారం బాక్సాఫీస్ (Boxoffice) దగ్గర గట్టి పోటీ ఉండబోతుంది. మే 1న రెండు భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. నాని (Nani) నటించిన ‘హిట్ 3’ (Hit3) మరియు సూర్య నటించిన ‘రెట్రో’ (Retro) సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. గతంలో ‘హిట్’ ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఉండటంతో ‘హిట్ 3’పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు సూర్య (Surya) తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్ కావడం, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించడంతో ‘రెట్రో’పై కూడా మంచి ఆసక్తి నెలకొంది.

Rajamouli : రాజమౌళి ఆలా హీరోయిన్ల బిస్కెట్లకు పడిపోతాడా..?

‘హిట్ 3’ చిత్రంలో నాని హీరోగా మరియు నిర్మాతగా కూడా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మే 1 సెలవు దినం కావడం వల్ల, లాంగ్ వీకెండ్‌ను గట్టి ఉపయోగించుకునే అవకాశం ఉంది. టీజర్, ట్రైలర్‌లు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అయితే చిత్రంలో హింసాత్మక అంశాలు ఎక్కువగా కనిపించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ బదులు, యూత్ ప్రేక్షకుల మీదే నాని ఎక్కువగా ఆధారపడుతున్నాడు.

‘రెట్రో’ విషయానికి వస్తే..ఈ సినిమా వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. సూర్య అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండటంతో, సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది. పూజా హెగ్డే గ్లామర్ అదనపు ఆకర్షణగా ఉండబోతోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ వారు సినిమాను తెలుగులో విడుదల చేయడం మరో ప్లస్ పాయింట్. మొత్తంగా ఈ వారం బాక్సాఫీస్ దగ్గర సందడి మొదలవడం ఖాయం అయినా, వారాంతానికి ఏ సినిమా నిలబడుతుందో చూడాలి.