Hit 3 Nani : హిట్ 3 నాని కండీషన్స్ కి డైరెక్టర్ షాక్..!

Hit 3 Nani న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస సక్సెస్ లతో సూపర్ ఫాం లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న రెండు సూపర్ హిట్లతో జోష్ మీద ఉండగా నెక్స్ట్ రాబోతున్న సరిపోదా శనివారం

Published By: HashtagU Telugu Desk
Nani Yellama Shelved due to Budget Issues

Nani Yellama Shelved due to Budget Issues

Hit 3 Nani న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస సక్సెస్ లతో సూపర్ ఫాం లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న రెండు సూపర్ హిట్లతో జోష్ మీద ఉండగా నెక్స్ట్ రాబోతున్న సరిపోదా శనివారం తో కూడా హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమా నుంచి ఈమధ్య వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేసింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అయితే హిట్ సినిమాల సీక్వెన్స్ లో కూడా నాని నటిస్తాడని తెలిసిందే. హిట్ 3 లో నాని ఉంటాడని హిట్ 2 లోనే రివీల్ చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. హిట్ సినిమాల నిర్మాతగా నాని రెండు సక్సెస్ అందుకోగా హిట్ 3 ని కూడా వాటి సరసన చేర్చాలని చూస్తున్నాడు. అయితే శైలేష్ కొలను రీసెంట్ మూవీ సైంధవ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది.

వెంకటేష్ నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా ఎఫక్ట్ తో హిట్ 3 స్టోరీ విషయంలో నాని కొన్ని కండీషన్స్ పెట్టాడట. రీసెంట్ గా హిట్ 3 స్టోరీ నరేషన్ ఇవ్వగా నాని కొన్ని సలహాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. నాని చెప్పిన మార్పులతో శైలేష్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. హిట్ 3 ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.

  Last Updated: 02 Mar 2024, 09:07 PM IST