Site icon HashtagU Telugu

HIT 3 : రెండో రోజుల్లో రూ.60 కోట్లు

Hit3 Collection

Hit3 Collection

బాక్స్ ఆఫీస్ వద్ద నాని వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని (Nani) తన సినీ ప్రయాణాన్ని అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించినా, ‘అష్టాచమ్మా’తో హీరోగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి, తనదైన నటనతో విభిన్నమైన పాత్రల్లో మెరిసి అభిమానుల మనసు దోచుకున్నారు. ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి హిట్‌లతో వరుసగా విజయాలు అందుకున్న నాని, ఈసారి మాత్రం తన మాస్ యాంగిల్‌కి ఒక వాయిలెంట్ టచ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘హిట్ 3’ (HIT3) సినిమాలో ఆయన పాత్ర, మేకోవర్ పూర్తిగా రఫ్, బోల్డ్ డైలాగ్స్‌తో కొత్తగా కనిపించడం తో అభిమానులు తెగ ముచ్చటపడుతున్నారు.

దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ.62 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. గురువారం విడుదలైన ఈ చిత్రం, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించబడగా, ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంది. సినిమాకు నాని పర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Indiramma house : ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దు: ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి సూచన

ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రావు రమేశ్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. కథనంలో తిష్టగా ఉండే టర్నింగ్ పాయింట్లు, టెంషన్ క్రియేట్ చేసే కథా నిర్మాణం సినిమాను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. శైలేష్ కొలను రూపొందించిన స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇప్పటికే నాని నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. టెక్నికల్ అంశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలిచాయి.

ఈ రోజు, రేపు వారాంతం (వీకెండ్) కావడంతో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శనివారం, ఆదివారం అభిమానులు, ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వస్తారు కాబట్టి హిట్-3 మరిన్ని రికార్డులను తిరగరాస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.