Site icon HashtagU Telugu

Anirudh : దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఇతడే !!

Anirudh Ravichander Remuner

Anirudh Ravichander Remuner

భారతీయ సంగీత రంగం (Indian music industry)లో ప్రస్తుత ట్రెండ్ సెట్టర్ ఎవరంటే అనిరుధ్ (Anirudh Ravichander) అనే చెప్పాలి. అతని మ్యూజిక్ అంటే యూత్ పడిచస్తారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో అతని మ్యూజికల్ టచ్‌ సినిమాకే ఊపొచ్చేలా చేస్తుంది. ఏ సినిమా అయినా అనిరుధ్ మ్యూజిక్ ఇవ్వాలని నిర్మాతలే కాదు, హీరోలు సైతం కోరుకుంటారు. అంతే కాదు, అతని మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ అయితే ఆడియో కంపెనీలు వాటిని కొనుగోలు చేసేందుకు పోటీ పడతాయి. ఈ డిమాండ్‌తో అనిరుధ్‌ పారితోషికంలోనూ దేశంలోనే నంబర్ వన్‌ అయ్యాడు.

Liquor Rates Hike : కిక్ లేకుండా చేస్తావా అంటూ సీఎం రేవంత్ పై మందుబాబులు గరం గరం

ప్రస్తుతం అనిరుధ్‌ ఒక్కో సినిమాకు కనీసం రూ.15 కోట్లు (Remuneration) తీసుకుంటున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ‘పారడైజ్’ చిత్రానికి కూడా ఇంతటి రెమ్యూనరేషన్‌ ఇచ్చారని సమాచారం. ఆ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ రూ.18 కోట్లకు అమ్ముడుపోవడం చూస్తే.. అనిరుధ్‌ మ్యూజిక్ రేంజ్ ఏ మేరకు ఉందో అర్థమవుతుంది. ఇతర సంగీత దర్శకుల రెమ్యూనరేషన్ చూస్తే.. తమన్‌కు రూ.7-8 కోట్లు, దేవిశ్రీ ప్రసాద్‌కు రూ.10 కోట్లు రెమ్యూనరేషన్‌ అందుతోందట. పుష్ప వంటి భారీ విజయాలతో దేవి కూడా తన స్థానం మళ్లీ బలంగా నిలిపాడు.

ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ పాటలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులే కాదు, దేశం మొత్తం ఎదురుచూసే స్థాయిలో ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో రెహమాన్ మ్యూజిక్‌ మాస్‌కు చేరువ కాకపోవడం వల్ల డిమాండ్ తగ్గింది. అయితే ‘పెద్ది’ సినిమాతో మళ్లీ మంచి ఆల్బమ్ ఇచ్చారన్న టాక్ ఉంది. కొత్త తరం ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రెహమాన్ ట్రాక్ మార్చారని అంటున్నారు. కానీ ఇప్పటి మార్కెట్‌లో చూస్తే – అనిరుధ్‌ డోమినేషన్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న సంగీత దర్శకుడిగా అనిరుధ్‌నే ఉన్నాడు.