Prabhas Salaar కె.జి.ఎఫ్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో వస్తున్న సలార్ పార్ట్ 1 డిసెంబర్ 22న రిలీజ్ ఫిక్స్ చేశారు. క్రిస్మస్ కి అసలైతే వేరే సినిమాలు రిలీజ్ ఉండగా డైనోసార్ ప్రభాస్ వస్తున్నాడు అని తెలియగానే అందరు తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. ప్రభాస్ సలార్ 1 మీద తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. కె.జి.ఎఫ్ 1, 2 పార్ట్ లతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ అంటూ ఒక పవర్ ప్యాక్డ్ మూవీతో వస్తున్నారు.
ఈ సినిమా విషయంలో ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. సినిమా గురించి ఎక్కడ డౌట్ పడాల్సింది లేదని అంటున్నారు. ప్రభాస్ సలార్ 1 గ్లింప్స్ తోనే వావ్ అనిపించగా సినిమా లో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయని అంటున్నారు. ప్రభాస్ సలార్ ఏమేరకు అంచనాలను అందుకుంటుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలిని తీర్చుతుందా లేదా అన్నది చూడాలి.
Also Read : Pooja Hegde : పూజా బేబీకి ఆ ఛాన్స్ అయినా ఉందా లేదా..?
సలార్ 1 (Salaar) ప్రభాస్ ఫ్యాన్స్ కే కాదు మూవీ లవర్స్ కి ఫుల్ మీల్స్ ఇవ్వడం పక్కా అని అంటున్నారు మేకర్స్. సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఫ్యాన్స్ కే కాదు సగటు సినీ ప్రేక్షకుడిని కూడా వావ్ అనేలా చేస్తాయని చెబుతున్నారు. సలార్ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.
కె.జి.ఎఫ్ (K.G.F) కి పనిచేసిన టెక్నిషియన్స్ అందరు సలార్ కోసం పనిచేశారు. మరోసారి ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తన మార్క్ చూపిస్తారని తెలుస్తుంది. ప్రభాస్ ని డైనోసార్ గా పోల్చుతూ వచ్చిన సలార్ టీజర్ సెన్సేషన్ అవగా అందుకు తగినట్టుగానే సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.
We’re now on WhatsApp. Click to Join