High Court BIG Shock To Devara : ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రానికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ (NTR), RRR తర్వాత గ్యాప్ తీసుకొని దేవర (Devara) సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఈ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ తో పాటు ఏపీ సర్కార్ దేవర కు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్ లలో రూ.413, సింగిల్ స్క్రీన్లలో రూ.250, ఏపీలో మల్టీప్లెక్స్లో రూ.325, సింగిల్ స్క్రీన్లలో రూ.200 వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.
ఇటు ఏపీ సర్కార్ కూడా దేవర మూవీ టీమ్ కు గుడ్ న్యూస్ తెలిపింది. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‍పై అదనంగా రూ.135 పెంచుకునేందుకు అలాగే సింగిల్ స్క్రీన్‍లలో బాల్కనీ టికెట్‍పై అదనంగా రూ.110, లోయర్ క్లాస్ టికెట్‍పై రూ.60 అధికం చేసేందుకు అనుమతి ఇచ్చింది. రెండు వారాల వరకు టికెట్లపై అదనపు ధరలు ఉంచుకోవచ్చంటూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోను సవాలు చేస్తూ.. హైకోర్టులో పిటిషన్ ధాఖలు కాగా.. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం 14 రోజుల వరకు అనుమతిని 10రోజులకే పరిమితం చేస్తూ తీర్పు వెలువరించింది. ఇది మేకర్స్ కు షాక్ అనే చెప్పాలి. 14 రోజుల వరకు అయితే సినిమా కలెక్షన్లు ఎక్కువగా ఉండేది..కానీ అందులో నాల్గు రోజులు తీసేయడం తో కాస్త డ్రాప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
మరోవైపు ఏపీలో ఈ సినిమా ప్రత్యేక షోల కోసం అనుమతులు జారీ చేసింది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే రేపు అర్థరాత్రే 325 అదనపు షోలు పడనున్నాయి. దీంతో మొదటి రోజు ఈ సినిమాకు కలెక్షన్స్ భారీగా రాబట్టే అవకాశాలున్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 182 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే రూ. 184 కోట్ల షేర్ రాబట్టాలి. మొత్తంగా ‘దేవర’కు పాజిటివ్ టాక్ వస్తే కనుక బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం అనే చెప్పాలి.
Read Also : CM Siddaramaiah : ‘ముడా’ స్కాం.. సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణకు కోర్టు ఆదేశం