Hi Nanna Trailer : కన్నీరు పెట్టిస్తున్న ‘హాయ్ నాన్న’..

తండ్రీకూతుళ్ల ఎమోషన్‌ తో పాటు లవ్‌ స్టోరీ మనసుకు హత్తుకునేలా సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది

Published By: HashtagU Telugu Desk
Hi Nanna Trailer

Hi Nanna Trailer

నేచురల్ స్టార్ నాని (Nani) , సీతారామం ఫేమ్ మృణాల్ (Mrunal Thakur) జంటగా నూతన డైరెక్టర్ శౌరవ్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘హాయ్ నాన్న’ (Hi Nanna). ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని డిసెంబర్ 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ చేసారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ , సాంగ్స్ సినిమా ఫై ఆసక్తి నింపగా..తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలు రెట్టింపు చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. తండ్రి కూతురు అనుబంధం మధ్య మొదలైంది.. కూతురు కోసం రకరకాల కథలు చెబుతుంటాడు నాని. అనుకోకుండా వీళ్ల జీవితాల్లోకి మృణాల్ వస్తుంది. ఆ తర్వాత ఓ సందర్భంలో తన కూతురికి తల్లి కథ చెబుతుంటాడు. తల్లి ఎలా ఉంటుందో తెలియని ఆ పాప.. ఆ స్థానంలో మృణాల్‌ను ఊహించుకుంటుంది. అతని గతం ఏమిటి.. భర్తను, పాపను వదిలి భార్య ఎక్కడికి వెళ్లింది… ఆ ప్లేస్‌ను మృణాల్ రీప్లేస్ చేసిందా, లేదా అనే అంశాలు అసలు కథ. తండ్రీకూతుళ్ల ఎమోషన్‌ తో పాటు లవ్‌ స్టోరీ మనసుకు హత్తుకునేలా సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.

హాయ్ నాన్న సినిమా ట్రైలర్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. భావోద్వేగపూరితంగా సాగింది. ఈ సినిమాలో విరాజ్ పాత్రలో నాని, యష్న క్యారెక్టర్‌ను మృణాల్ చేశారు. నాని కూతురు మహీ పాత్రలో బేబి కియారా ఖన్నా నటించారు. మొత్తంగా 2 నిమిషాల 40 సెకన్ల పాటు హాయ్ నాన్న ట్రైలర్ ఉంది. ఈ చిత్రానికి సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా.. తెలుగు ట్రైలర్ ఇప్పటికే 2 మిలియన్లపైగా వ్యూస్ సాధించి.. యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లిస్ట్ లో నిలిచింది.

ట్రైలర్ కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి

Read Also : IT Raids : హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ రైడ్స్.. ఈసారి టార్గెట్ ఎవరంటే ?

  Last Updated: 25 Nov 2023, 10:13 AM IST