Hi Nanna : హాయ్ నాన్న నుండి ఐటెం సాంగ్ రిలీజ్

'ఒడియమ్మా బీటు... ఈడీఎంలో బీటు...' అంటూ సాగే ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రాయగా

  • Written By:
  • Publish Date - November 28, 2023 / 06:51 PM IST

నేచురల్ స్టార్ నాని (Nani) , సీతారామం ఫేమ్ మృణాల్ (Mrunal Thakur) జంటగా నూతన డైరెక్టర్ శౌరవ్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘హాయ్ నాన్న’. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి సినిమా ఫై ఆసక్తి పెంచుతున్నారు. ఇప్పటికే గ్లిమ్ప్స్, గాజుబొమ్మ అనే మెలోడీ సాంగ్, ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన మేకర్స్… తాజాగా సినిమాలోని ప్రత్యేక సాంగ్ ను రిలీజ్ చేసి మరింత అంచనాలు పెంచారు. ఈ సినిమాలో శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ తో పాటు కొన్ని సీన్ల లలో నటించినట్లు ట్రైలర్ తో తెలిసిపోయింది.

ఇక ప్రత్యేక సాంగ్ విషయానికి వస్తే..’ఒడియమ్మా బీటు… ఈడీఎంలో బీటు…’ అంటూ సాగే ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రాయగా..శృతి హాసన్ అండ్ చిన్మయి శ్రీపాదది పాడడం విశేషం. అలాగే మేల్ లిరిక్స్ యువ తమిళ హీరో, చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ పాడడం మరో విశేషం. ఇక ఈ మూవీ ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా తెరకెక్కగా.. చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మించారు. బేబీ కియారా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి హేషామ్ అబ్దుల్ వాహెబ్ సంగీతం అందించారు.

Read Also : Mansoor Ali Khan : ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి వెయ్యి కోట్లు సంపాదించాడు – నటుడు మన్సూర్ అలీ