Site icon HashtagU Telugu

Tamannah: సోషల్ మీడియా ట్రోల్స్ పై ఘాటుగా రియాక్ట్ అయిన తమన్నా.. అది వాళ్ళకు ముందే తెలుసంటూ?

Images

Images

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. కాగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె అందానికి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు పూర్తి అయిన కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా తమన్నా ప్రస్తుత వయసు 33 ఏళ్ళు అయినప్పటికీ ఆమె ఇప్పటికి 25 ఏళ్ళ యువతి లాగే కనిపిస్తోంది.

వయసుతో పాటు ఆమె అందం కూడా పెరుగుతోంది. ఇకపోతే సెలెబ్రెటీలకు ట్రోల్స్, సోషల్ మీడియా వేధింపులు కామన్. తమన్నా భాటియా పలుమార్లు ట్రోల్స్ కి గురైంది. కోవిడ్ సోకిన తమన్నా చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఆమె బరువు పెరిగారు. ఆమెపై కొందరు బాడీ షేమింగ్ కి పాల్పడ్డారు. ఈ నెగిటివ్ కామెంట్స్ పై తమన్నా ఫైర్ అయ్యింది. కోవిడ్ కారణంగా మానసికంగా శారీరకంగా ఒత్తిడి ఎదుర్కొన్నట్లు తమన్నా చెప్పుకొచ్చింది. విమర్శలకు సమాధానంగా తమన్నా కఠిన వ్యాయామం చేసి సన్నబడింది. పూర్వ స్థితికి వచ్చింది.

కాగా సోషల్ మీడియా ట్రోల్స్ పై తమన్నా తాజాగా స్పందించారు. ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సెలెబ్రిటీల జీవితాల పై చాలా మంది సొంత అభిప్రాయాలు వ్యక్త పరుస్తూ ఉంటారు. మా జీవితాల్లో ఏం జరుగుతుందో మా కంటే ముందే వాళ్లే చెబుతారు. అందుకే నేను ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోను అని తమన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నా దృష్టి కెరీర్ మీదే. సౌత్, నార్త్ నాకు రెండూ సమానమే. రెండు సొంత ఇళ్లలాంటివే. నా కెరీర్ నార్త్ లో మొదలైంది. నటులకు భాషా బేధాలు ఉండవు అని కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యింది తమన్నా.