Site icon HashtagU Telugu

Taapsee : తాప్సీకి ఎన్ని బిజినెస్‌లు ఉన్నాయో తెలుసా? బాగా సంపాదిస్తుందిగా..

Heroine Taapsee Pannu Income and Business Details

Heroine Taapsee Pannu Income and Business Details

తెలుగులో రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం(Jhummandi Naadam) సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ(Taapsee). అనంతరం తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడే సినిమాలు చేస్తుంది. బాలీవుడ్(Bollywood) లో వరుసగా ఫిమేల్ ఓరియెంటెడ్, కమర్షియల్ సినిమాలు చేస్తుంది. సినిమాలతో బాగానే సంపాదిస్తూ మరో పక్క పలు యాడ్స్ తో కూడా సంపాదిస్తుంది.

సెలబ్రిటీలంతా సక్సెస్ అయ్యాక బిజినెస్ లలో పెట్టుబడులు పెడతారని తెలిసిందే. తాప్సీ కూడా వివిధ రంగాల్లో బాగానే పెట్టుబడులు పెట్టింది. తాప్సీకి ముంబైలో ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే ఓ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ ఉంది. ఈ సంస్థ పెళ్లిళ్ల ఈవెంట్స్ ని చేస్తుంది. అలాగే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లో పూణే 7 ఏసెస్ అనే బ్యాడ్మింటన్ ఫ్రాంచైస్ కూడా తనదే. టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్ టైగర్స్ ఫ్రాంచైస్ కూడా తనదే. అలాగే తన సొంత నిర్మాణ సంస్థ ఔట్ సైడర్స్ ఫిలిమ్స్ ఉంది. దీంతో పలు సినిమాలలో కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక వీటితో పాటు ఇటీవలే తాప్సీ క్లబ్ అని దుబాయ్ లో ఓ కంపెనీ స్టార్ట్ చేసింది. అక్కడ ఈవెంట్స్, ఎంటర్టైన్మెంట్ కి సంబంధిన ప్రోగ్రామ్స్ చేయనుంది.

ఇలా తాప్సీ ఓ పక్క సినిమాలు, యాడ్స్ చేస్తూ సంపాదిస్తూనే మరో పక్క క్రీడల్లో, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల్లో, సినిమా నిర్మాణంలో పెట్టుబడులు పెట్టి బిజినెస్ లు చేస్తుంది. మొత్తానికి అన్ని వైపుల నుంచి బాగానే సంపాదిస్తుంది తాప్సీ.

 

Also Read : Sreeleela: శ్రీలీల క్రేజ్ మాములుగా లేదు, ఒక్క ఈవెంట్ కే 20 లక్షలు!