Site icon HashtagU Telugu

Sridivya : ఆ ఎక్స్ పీరియన్స్ లేనిదే పెళ్లి చేసుకోదట.. హీరోయిన్ కామెంట్స్ కి ఆడియన్స్ షాక్..!

Heroine Sridivya Response About Marriage After That Experience

Heroine Sridivya Response About Marriage After That Experience

తెలుగు అమ్మాయే కానీ తమిళంలో సూపర్ పాపులర్ అయిన హీరోయిన్ శ్రీ దివ్య (Sridivya) తెలుగులో మనసారా, బస్టాప్ సినిమాల్లో నటించి ఆ తర్వాత అక్కడకు చెక్కేసింది. కోలీవుడ్ లో తనకు వచ్చిన క్రేజ్ ని వాడుకుంటూ వరుస సినిమాలు చేసింది. అదేంటో తెలుగు అమ్మాయిలకు తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.

We’re now on WhatsApp : Click to Join

మన దగ్గర కన్నా ఇక్కడ అవకాశాలు ఎక్కువ వస్తాయి. తెలుగులో కేవలం రెండు సినిమాలే చేసిన శ్రీ దివ్య తమిళంలో దాదాపు 20 సినిమాల దాకా చేసింది.

ఇక కెరీర్ కాస్త మందకొడిగా సాగుతున్న ఈ టైం లో అమ్మడి పెళ్లి గురించి మీడియాలో స్పెషల్ టాపిక్ అయ్యింది. శ్రీదివ్య మ్యారేజ్ పై మీడియా హడావిడి చేయడం చూసి ఫైనల్ గా అమ్మడు కూడా స్పందించింది. నేను పెళ్లికి రెడీనే కాకపోతే ఒక సాలిడ్ హిట్ కొట్టి ఆ ఎక్స్ పీరియన్స్ చూసిన తర్వాత పెళ్లి చేసుకుంటానని అంటుంది.

అదేంటి హిట్ కొట్టాక పెళ్లేంటని కొందరు అనుకుంటున్నా.. ఎవరి రీజన్స్ వారికుంటాయని కొందరు అనుకుంటున్నారు. తమిళ ఆడియన్స్ మాత్రం శ్రీ దివ్య ఇంకా సినిమాలు చేయాలని కోరుతున్నారు. హిట్లు లేక కెరీర్ లో కాస్త వెనకపడిన ప్రతి హీరోయిన్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. వారి దారిలోనే శ్రీ దివ్య వెళ్తుందని అనుకున్నారు. కానీ అమ్మడు మాత్రం హిట్టు కొట్టాకే పెళ్లి అంటుంది. హిట్టు కొట్టాక వరుస అవకాశాలు వస్తాయి కదా మరి అప్పుడు ఏం చేస్తుంది అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Bobby Deol : ఒక్క హిట్టు షేక్ చేస్తున్న బాబీ ఆఫర్లు..!