Site icon HashtagU Telugu

Sangeetha : హీరోయిన్ సంగీత లవ్ స్టోరీ తెలుసా? అవార్డు ఈవెంట్లో అతన్ని చూసి తనే..

Heroine Sangeetha interesting Love Story with her husband Singer Krish

Heroine Sangeetha interesting Love Story with her husband Singer Krish

1997లో మలయాళం(Malayalam) సినిమాలతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగీత(Sangeetha) ఆ ఆతర్వాత తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో వరుస సినిమాలు చేసింది. తెలుగులో ఖడ్గం(Khadgam) సినిమాలో ఒక్క ఛాన్స్ అంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకొని వరుస సినిమాలు చేసింది. మధ్యలో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చినా ఇటీవల సరిలేరు నీకెవ్వరూ(Sarileru Nikevvaru) సినిమాతో సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ వారసుడు(Varasudu), మాసూద.. ఇలా వరుస సినిమాలు చేస్తోంది.

సంగీత.. సింగర్ క్రిష్(Singer Krish) ని 2009లో పెళ్లి(Marriage) చేసుకుంది. అయితే వీళ్ళ లవ్ స్టోరీ(Love Story) చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంగీత వీళ్ళ లవ్ స్టోరీ గురించి చెప్పింది. సంగీత హీరోయిన్ గా ఉన్నప్పుడు ఓ అవార్డు ఈవెంట్ కి వెళ్తే అక్కడ బెస్ట్ సింగర్ గా క్రిష్ కి తన చేతుల మీదుగా వార్డు ఇప్పించారట. ఆ సమయంలో క్రిష్ ని చూసి చాలా బాగున్నాడు, ఎవరో ఇతను అంటూ ఆలోచించింది. సిమ్రాన్ కూడా ఈ అబ్బాయి బాగున్నాడు అని కామెంట్స్ చేసిందట. అప్పుడు సంగీత వాళ్ళ అమ్మతో.. పెళ్లి చేసుకోమని అంటున్నావుగా ఇలాంటి అబ్బాయి చూడు ఉంటే చేసుకుంటాను, పోనీ ఈ అబ్బాయి అయినా పర్లేదు అని చెప్పింది అంట. అయితే అతను సంగీత కంటే చిన్నవాడేమో అని వాళ్ళ అమ్మ డౌట్ అడిగింది.

అదే రోజు సాయంత్రం ఓ పార్టీలో సంగీతకు, క్రిష్ కి కామన్ ఫ్రెండ్ ఉండటంతో వీళ్ళ పరిచయం అయింది. ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలని సంగీత క్రిష్ ఏజ్ అడిగింది అట. తనకంటే రెండేళ్లు పెద్ద అని తెలుసుకొని హమ్మయ్య అనుకుందట సంగీత. ఇక తనే స్టెప్ తీసుకొని మాట్లాడటం మొదలుపెట్టి నంబర్లు మార్చుకొని అలా చాటింగ్, కాల్స్ తో దగ్గరయి మూడు నెలల్లో నిశ్చితార్థం చేసుకున్నారని సంగీత చెప్పింది. నిశ్చితార్థం చేసుకున్న ఆరు నెలలకి పెళ్లి చేసుకున్నట్టు చెప్పింది. అసలు పరిచయమే లేని ఓ వ్యక్తిని అవార్డు ఈవెంట్ లో చూడగానే నచ్చడంతో తనే ముందడుగు వేసి మాట్లాడి, తనే ప్రపోజ్ చేసి పెళ్ళికి ఒప్పించినట్లు సంగీత చెప్పింది.

ప్రస్తుతం సంగీత -క్రిష్ లకు వీరిద్దరికి ఒక కూతురు ఉంది. ఇక క్రిష్ ఒక మ్యూజిక్ బ్యాండ్ నడిపిస్తూ, యాక్టర్ గా కూడా మారాడు. సంగీత ప్రస్తుతం పలు టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉంది.

 

Also Read : Kamal Haasan: ‘ప్రాజెక్ట్ కె’లోకి విలక్షణ నటుడు కమల్ హాసన్.. రికార్డులు బద్దలు కావడం ఖాయం..!