సమంత క్రేజ్ మాములుగా లేదు కదా..!

తెలుగులో టాప్ హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. కానీ వాళ్లందరీ కన్నా సమంత టాప్ ప్లేస్ లో నిలిచి ఆశ్చర్యపర్చింది. ఇంతకీ సమంత ఏవిషయంలో టాప్ ప్లేస్ లో ఉందనుకుంటున్నారా.. అదేనండీ సోషల్ మీడియాలోనట. దీంట్లో అత్యంత పాపులారిటీ ఉన్న తెలుగు హీరోయిన్ గా సమంత నిలిచింది.

  • Written By:
  • Updated On - October 6, 2021 / 04:14 PM IST

తెలుగులో టాప్ హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. కానీ వాళ్లందరీ కన్నా సమంత టాప్ ప్లేస్ లో నిలిచి ఆశ్చర్యపర్చింది. ఇంతకీ సమంత ఏవిషయంలో టాప్ ప్లేస్ లో ఉందనుకుంటున్నారా.. అదేనండీ సోషల్ మీడియాలోనట. దీంట్లో అత్యంత పాపులారిటీ ఉన్న తెలుగు హీరోయిన్ గా సమంత నిలిచింది. ఇంతకుముందు కాజల్ ఉండేదట. ప్రస్తుతం సమంత కాజల్ ను దాటేసి టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఇక మూడో స్థానంలో అనుష్క శెట్టి నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రష్మిక మందన్న, తమన్న భాటియా, కీర్తి సురేశ్, పూజ హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, సాయి పల్లవి ఉన్నారు. ఈ వివరాలను ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా వెల్లడించింది.

సమంత టాప్ ప్లేస్ లో నిలవడానికి ప్రధాన కారణం ఆమె విడాకుల వ్యవహరమని చెప్పక తప్పదు. ఇటీవలనే తన భర్త నాగచైతన్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించి చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 2న చై-సామ్ విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించినా.. ఇప్పటికీ సమంత, నాగచైతన్య వార్తలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో టాప్ ప్లేస్ దక్కించుకుంది సమంత.

కాగా సమంత-నాగచైతన్య విడాకుల విషయమై టాలీవుడ్ నటులు, ప్రముఖులు చాలామంది స్పందించారు. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్సాండ్ అయ్యారు. నిజమెంటో, వాస్తమెంటో తెలియక ఇష్టానుసారంగా కామెంట్స్ చేశారు. దీంతో టాలీవుడ్ హీరో వెంకీ స్పందించారు. తన ఇన్స్టాగ్రాం స్టాటస్‌లో దిమ్మతిరిగిపోయే కామెంట్ పెట్టారు. (We Should Open Our Mind Before We Open Our Mouth) “నోరు తెరిచే ముందు మనసు తెరవండి” అని అర్థం వచ్చే ఇంగ్లీష్‌లో ఓ కామెంట్ పెట్టి తప్పుగా మాట్లాడుతున్నవారికి సెటైరికల్‌గా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం వెంకీ చేసిన కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.