Site icon HashtagU Telugu

Negative Publicity : నెగటివ్ ప్రచారంపై ఘాటుగా స్పందించిన హీరోయిన్

Trisha

Trisha

ప్రముఖ సినీ నటి త్రిష (Trisha)సోషల్ మీడియా(Social Media)లో జరుగుతున్న నెగటివ్ ప్రచారం(Negative publicity)పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన త్రిష.. “ఇతరులపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం, నిందలు వేయడం ఇలాంటి వారితో కలిసి జీవించాల్సిన వారు ఎలా ఉంటారో ఊహించుకుంటే బాధగా ఉంటుంది. అలాంటి నెగటివ్ భావాలతో మనస్సు నింపుకున్నవారు ప్రశాంతంగా నిద్రపోతారా?” అంటూ తన ఆవేదనను బయటపెట్టింది. గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) అనే సినిమా తమిళ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పకపోయిన విషయంపై ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరగడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Stunt Design Award: ఆస్కార్ అకాడ‌మీ కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై స్టంట్ డిజైన్ అవార్డు, నిబంధ‌న‌లివే!

తాజాగా విడుదలైన “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమా తెలుగు ఆడియన్స్ లలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో త్రిష ప్రధాన పాత్రలో నటించినా, తమిళ భాషలో డబ్బింగ్ ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. కొన్ని వర్గాలు ఇది తమిళ ప్రేక్షకులను నిర్లక్ష్యం చేయడమేనని అభిప్రాయపడ్డాయి. అయితే త్రిష తనకు సంబంధించిన నిర్ణయాల వెనుక కారణాలు ఉన్నాయని, అవి వ్యక్తిగతం కావచ్చని సూచించింది.

త్రిష తన సినీ జీవితాన్ని 2000ల మొదట్లో ప్రారంభించి దక్షిణ భారతదేశంలో ఎంతో గుర్తింపు పొందింది. తెలుగు, తమిళ సినిమాలలో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి అభిమానుల మనసులను గెలుచుకుంది. “వర్షం”, “నువ్వు వస్తానంటే నేను వద్దంటానా”, “96”, “అభినయ తార” వంటి సినిమాలతో త్రిష తనకు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.