Site icon HashtagU Telugu

Radhika Apte: టాలీవుడ్ పై సంచలన వాఖ్యలు చేసిన రాధిక ఆప్టే.. ఛీఛీ వాళ్ళేం హీరోలంటూ?

Mixcollage 05 Mar 2024 08 48 Am 3476

Mixcollage 05 Mar 2024 08 48 Am 3476

తెలుగు సినిమా ఇండస్ట్రీ క్రేజ్ పెరిగిపోవడంతో చాలా భాషల హీరోయిన్ లు తెలుగులో నటించాలని కోరుకోవడం తోపాటు ఆసక్తిని కనబరుస్తున్నారు. తెలుగు సినిమాలలో అవకాశాలు వస్తే అదే పదివేలు అని అనుకుంటున్నారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం తెలుగులో నటించి మంచి గుర్తింపు దక్కగానే వెళ్తున్నారు. అయితే అంతవరకు బాగానే ఉన్నా వేరే చోట ఆఫర్ రాగానే టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి నోటికొచ్చిన విధంగా కామెంట్స్ చేస్తూ లేని పోనీ కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటున్నారు. అందులో రాధికా ఆప్టే అందరికంటే ముందుంటారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధిక ఆప్టే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ మేరకు ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్‌లో హీరోయిన్లకే కాదు, వాళ్ల కోసం రాసే పాత్రలకు ప్రాధాన్యత ఉండదు. సెట్స్‌లో హీరోయిన్‌ను మూడో వ్యక్తిగా మాత్రమే చూస్తారు అంటూ విమర్శించారు. టాలీవుడ్‌లో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇష్టానుసారం షూటింగ్స్ రద్దు చేస్తారు. చేసినపుడు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు అని చెప్పుకొచ్చారు రాధిక. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు నాకు చాలాసార్లు ఎదురయ్యాయి.

అందుకే టాలీవుడ్‌కు దూరంగా ఉన్నాను అని తెలిపారు రాధిక ఆప్టే. కాగా హీరోయిన్ రాధిక తెలుగులో రక్త చరిత్ర, ధోనీ, లెజెండ్, లయన్ సినిమాల్లోనే నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరే సినిమాలలో కూడా ఆమె నటించలేదు. సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ పై షాకింగ్ వాక్యాలు చేయడంతో లెటిజన్స్ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Exit mobile version