Raashi Khanna: కొత్త ఇంటిని కొనుగోలు చేసిన రాశి ఖన్నా.. ప్రత్యేకమైన పూజలు?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో సినిమా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగశౌర్య, రామ్ పోతినేని,రవితేజ గోపీచంద్ లాంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. We’re now […]

Published By: HashtagU Telugu Desk
Raashi Khanna

Raashi Khanna

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో సినిమా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగశౌర్య, రామ్ పోతినేని,రవితేజ గోపీచంద్ లాంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

We’re now on WhatsApp. Click to Join
ఇకపోతే ఇటీవల కాలంలో రాశి ఖన్నా కు అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. సినిమాలలో నటించక పోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో ఉంచుకుంటూ ఉంటుంది. ఈమె తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల బాలీవుడ్‌ యోధ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సబర్మతి రిపోర్ట్, అరణ్మై-4 వంటి చిత్రాల్లో కనిపించనుంది. తెలుగులో చివరిసారిగా నాగ చైతన్య సరసన థ్యాంక్‌ యూ చిత్రంలో నటించింది.

Also Read: Priyamani: ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ప్రియమణి.. అందాల ఆరబోత మామూలుగా లేదుగా?

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో ఒక ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఇంటిలో పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే గతంలోనే హైదరాబాద్‌లో రెండు ఇళ్లు కొన్న రాశి ప్రస్తుతం మూడో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా నూతన గృహా ప్రవేశానికి సంబంధించిన పిక్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో రాసి కన్నా సాంప్రదాయబద్ధంగా పండితులతో కలిసి పూజలు చేయడంతో పాటు గడపకు బొట్లు పెట్టి మరి ప్రత్యేక పూజలు చేస్తోంది. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో రాశి కన్నా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read: Pushpa 2: యశ్ రికార్డ్ ని బన్నీ బద్దలు కొట్టనున్నాడా.. పై చేయి మాత్రం ఆ హీరోదే!

  Last Updated: 06 Apr 2024, 12:07 PM IST