Site icon HashtagU Telugu

Kangana Ranaut: ‘ధాకడ్‌’ డిజాస్టర్ పై కంగనా కామెంట్స్!

Kangana

Kangana

కంగనా రనౌత్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్న నటి. తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వ్యక్తపరిచే హీరోయిన్లలో తానుఒకరు. ఆమె వ్యాఖ్యలు, ట్వీట్లు పలుమార్లు వివాదాస్పదమయ్యాయి. కంగనా మణికర్ణిక, క్వీన్ వంటి భారీ విజయాలను బాలీవుడ్ కు అందించింది. ఇటీవల ధాకడ్‌తో సినిమాతో భారీ పరాజయం మూటగట్టుకుంది. ఆ మూవీ ప్రభావం కంగనాపైనే కాకుండా బాలీవుడ్ పై ప్రభావం చూపింది. కలెక్షన్లు చాలా పూర్ గా ఉన్నాయి. సినిమా బడ్జెట్ లో సగం డబ్బులు కూడా రాబట్టలేకపోయింది. దీంతో కంగనాపై విమర్శలొచ్చాయి. నెటిజన్స్ ట్రోలింగ్ మొదలైంది. దీనిపై కంగనా రియాక్ట్ అయ్యింది. “2019లో ‘మణికర్ణిక’ సూపర్ హిట్…2021 లో కూడా హిట్ ఇచ్చాను… ‘తలైవి’ OTTలో వచ్చి భారీ విజయం సాధించింది. నా జర్నీ ముగిసిపోలేదు. చాలా గొప్ప అవకాశాలున్నాయి” అని ధీటుగా రిప్లై ఇచ్చింది కంగనా.