Mehreen : నిజంగా.. నాకు మంచి రోజులు వచ్చినట్టే..!

మహానుభావుడు, కృష్ణగాడి వీరప్రేమ గాథ, రాజా ది గ్రేట్, ఎఫ్2 లాంటి సినిమాలతో తెలుగు తెరపై తనదైన ముద్ర వేసింది మెహ్రీన్. ఒకవైపు ఫన్ అండ్ ప్రస్టేషన్ తో నవ్వులూ పూయిస్తూనే..

  • Written By:
  • Updated On - November 1, 2021 / 12:12 PM IST

మహానుభావుడు, కృష్ణగాడి వీరప్రేమ గాథ, రాజా ది గ్రేట్, ఎఫ్2 లాంటి సినిమాలతో తెలుగు తెరపై తనదైన ముద్ర వేసింది మెహ్రీన్. ఒకవైపు ఫన్ అండ్ ప్రస్టేషన్ తో నవ్వులూ పూయిస్తూనే.. మరోవైపు కథాబలమున్న సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతోంది. తాజాగా మారుతి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మెహ్రీన్‌ జంటగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్‌ 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మెహ్రీన్ ముచ్చట్లు..

కష్టమైన పాత్రలను పోషించడం చాలా ఇష్టం. ఎందుకంటే అవన్నీ చాలెంజింగ్, సరాదాగానూ ఉంటాయి. కష్టమైన పాత్రలు చేసినప్పుడే నటన మరింత మెరుగుపడుతుంది. ‘మంచి రోజులు వచ్చాయ్’ అనేది తండ్రీ-కూతుళ్ల బంధం ఆధారంగా తెరకెక్కిన కథ, రక్షణాత్మక ధోరణిలో ఉండే తండ్రి తన కుమార్తెను ప్రియుడి నుంచి దూరంగా ఉంచడానికి నిరంతరం ఎలా ప్రయత్నిస్తాడనే అంశాలు ఇందులో చూడొచ్చు.  ఈ సినిమా ప్రధానంగా కామెడీతో కూడుకున్నప్పటికీ.. ఎమోషన్స్, ఫ్యామిలీ వ్యాల్యూస్ కూడా ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటాయి. తన సహోద్యోగి (సంతోష్ శోబన్)తో ప్రేమలో పడే సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా నటించా. ఈ పాత్ర నాలోని కామెడీ టైమింగ్ ను బయటకు తీసుకువచ్చింది. ఈ మూవీ కేవలం 30 రోజుల్లోనే పూర్తయింది.

త్వరలో మంచిరోజులు వచ్చాయి విడుదల కానుంది. ఎఫ్3 మూవీ షూటింగ్ లో ఉంది. ఇవి కాకుండా కన్నడ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. నిజంగా నాకు మంచిరోజులేనట్టేనని అనిపిస్తుంది. లాక్‌డౌన్‌ సమయంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేయడం మిస్ అయ్యాను. మొదటి మూడు నెలలు కొంత విశ్రాంతి దొరికింది. కానీ పనికి చాలా దూరమయ్యా. కోవిడ్ ప్రతి ఒక్కరికీ పాఠం నేర్పింది, ఇప్పుడు నేను నా పనిని మునుపటి కంటే ఎక్కువగా గౌరవిస్తా. తెలుగు, తమిళం బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు కన్నడ నేర్చుకోడానికి ప్రయత్నిస్తున్నా. నేను ఎల్లప్పుడూ కొత్త భాషలను నేర్చుకోవడానికి ఉత్సాహంగా ఉంటాను. లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ సందడిగా కనిపిస్తుండటంతో ఆనందంగా ఉంది.