Site icon HashtagU Telugu

Ketika Sharma : కేతిక శర్మ స్టేట్ లెవెల్ ఛాంపియన్ అంట.. ఏ గేమ్‌లోనో తెలుసా? మరి సినిమాల్లోకి ఎలా?

Heroine Ketika Sharma how to enter in movies Ketika Life Story

Heroine Ketika Sharma how to enter in movies Ketika Life Story

ఢిల్లీ(Delhi) భామ కేతిక శర్మ(Ketika Sharma) టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలైనా ఎక్కువ ఫ్యాన్స్ ని, ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఆకాష్ పూరి ‘రొమాంటిక్'(Romantic) సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది కేతిక. ఆ తర్వాత లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలతో మెప్పించి ఇప్పుడు ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది.

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో(BRO) సినిమాలో కేతిక సాయి ధరమ్ తేజ్‌కి లవర్ గా నటిస్తుంది. బ్రో సినిమా జులై 28న రిలీజ్ కానుంది. దీంతో కేతిక ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేతిక తన గురించి, సినిమాల్లోకి ఎలా వచ్చిందో తెలిపింది.

కేతిక మాట్లాడుతూ.. మా ఫ్యామిలీలో చాలా మంది డాక్టర్లే. నేను కూడా డాక్టర్ అవ్వాలని అనుకునేవాళ్లు. కానీ నాకు సినిమాలు ఇంట్రెస్ట్. నేను స్విమ్మింగ్ కూడా బాగా చేస్తాను. స్టేట్ లెవల్ లో ఎన్నో స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని గెలిచాను. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ బాగా చేసేదాన్ని. అవి చూసి పూరి సర్ నన్ను చూసి నాకు కాల్ చేయించారు. ఫస్ట్ ఫేక్ అనుకున్నా తర్వాత నిజమని తెలిసి హైదరాబాద్ వచ్చి ఆడిషన్ ఇచ్చాను. అలా రొమాంటిక్ సినిమాతో సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లోకి వెళ్తా అంటే మా ఇంట్లో వద్దన్నారు. సంవత్సరం టైం ఇచ్చారు. ఆ టైంలోనే నాకు అవకాశాలు రావడంతో వాళ్ళు కూడా హ్యాపీ అని తెలిపింది.

ఇక కేతిక మంచి సింగర్ కూడా. రొమాంటిక్ సినిమాలో కేతిక ఓ సాంగ్ కూడా పాడింది. త్వరలో మరిన్ని తెలుగు సినిమాల్లో కనిపించనుంది కేతిక. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ హాట్ ఫొటోలతో సందడి చేస్తూ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది.

 

Also Read : Nithin : నితిన్ కొత్త సినిమా టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్..