Site icon HashtagU Telugu

Karisma Kapoor: మాజీ భర్తపై సంచలన వాఖ్యలు చేసిన కరిష్మా.. ఫ్రెండ్స్ తో గడపమన్నాడంటూ?

Mixcollage 13 Mar 2024 04 33 Pm 7467

Mixcollage 13 Mar 2024 04 33 Pm 7467

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు విడాకులు ఇవన్నీ కామన్. ఏళ్ల తరబడి ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని సెలబ్రిటీ జంటలు ఆ తర్వాత పెళ్లయిన కొద్ది రోజులకే విడిపోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పటికే చాలా మంది పెళ్లి పీటలెక్కి సంతోషంగా ఉంటే కొంతమంది విడాకులు తీసుకొని ఇంకా హ్యాపీగా గడిపేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ టైప్ వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఒక హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. డబ్బులు ఎక్కువ వస్తే తన భర్త తనను అమ్మేయాలని చూశాడని చెబుతూ షాక్ ఇచ్చింది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్. ఈ అమ్మడు ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఈ అమ్మడు మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ సిస్టరే. కాగా కరిష్మా కపూర్, అభిషేక్ బచ్చన్ ప్రేమించుకున్నారు. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ రాణీ ముఖర్జీతో ప్రేమాయణం నడిపాడు. కానీ అది కూడా కుదరలేదు. ఫైనల్ గా ఐశ్వర్య రాయ్ ను పెళ్లాడాడు అభిషేక్. ఆ తర్వాత కరిష్మా కపూర్‌ ఢిల్లీకి చెందిన బిజినెస్ మ్యాన్ సంజయ్‌ ను పెళ్లాడింది. వీరి వివాహం 2003లో జరిగింది.

ఈ ఇద్దరూ 2014లో విడాకులకు తీసుకున్నారు. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2014లో విడాకులకు అప్లై చేశారు 2016లో విడాకులు మంజూరు అయ్యాయి. అప్పటి నుంచి కరిష్మా సోలోగానే ఉంటుంది. తాజాగా కరిష్మా వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న కొన్ని విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా కరిష్మా మాట్లాడుతూ.. హనీమూన్ కు వెళ్లిన సయమంలో తనను తన భర్త స్నేహితులతో రాత్రంతా గడపాలని ఒత్తిడి చేశాడని తెలిపింది. అంతే కాదు వేలానికి పెట్టి తనను అమ్మేయాలని చూశాడని ఆవేదన వ్యక్తం చేసింది కరిష్మా కపూర్. అంతే కాదు తన తల్లితో కలిసి భర్త తనను కొట్టించాలని చూశారని తెలిపింది. ఈ మేరకు కరిష్మా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version