Site icon HashtagU Telugu

Haripriya : హీరోయిన్‌ హరిప్రియ నిశ్చితార్థం ఆ నటుడితోనే..

Haripriya Pilla Zamindar

Haripriya

‘పిల్ల జమీందార్‌’తో (Pilla Zamindar) హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి హరిప్రియ (Haripriya) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రియుడు, ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ వశిష్ఠ సింహాతో (Vasishta N.Simha) వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో నివాసంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను వశిష్ఠ ఇన్‌స్టా వేదికగా తాజాగా షేర్‌ చేశారు. ‘‘మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాం. మా నిశ్చితార్థం వేడుకగా జరిగింది. మీ ఆశీస్సులు కావాలి’’ అని పోస్ట్‌ పెట్టారు. వీటిని చూసిన నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కర్ణాటకు చెందిన హరిప్రియ (Haripriya) ‘తకిట తకిట’తో టాలీవుడ్‌కు పరిచయమ్యారు. అనంతరం ‘పిల్ల జమీందార్‌’తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ‘అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్‌’, ‘ఈ వర్షం సాక్షిగా’, ‘గలాట’, ‘జై సింహా’ చిత్రాల్లో నటించారు. మరోవైపు, ‘కేజీయఫ్‌’లో కమల్‌ పాత్ర పోషించి వశిష్ఠ గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు కుటుంబసభ్యుల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

Also Read:  Salman Likes Pooja: టాలీవుడ్ బ్యూటీపై మనసు పారేసుకున్న సల్మాన్.. పూజకు క్రేజీ ఆఫర్!